మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడున్నారు? తెలిసిన ఆచూకీ.. నడవలేని స్థితిలో ఆ దేశంలో!

మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు ఆచూకీ తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదని తెలుస్తోంది. తెలంగాణకు గణపతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Published on: Feb 24, 2026, 15:26:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మావోయిస్టు పార్టీ ఛీఫ్‌గా చాలాకాలం బాధ్యతలు నిర్వర్తించిన గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు ఆచూకీ తెలిసింది. చాలా ఏళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీని గణపతి నడిపించారు. కొన్నేళ్లుగా నేపాల్‌లో ఉంటున్నారు. తీవ్ర అనారోగ్యంతో గణపతి బాధపడుతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్నారు.

తెలిసిన ముప్పాళ్ల లక్ష్మణ రావు ఆచూకీ
తెలిసిన ముప్పాళ్ల లక్ష్మణ రావు ఆచూకీ

గణపతిని ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గణపతి కూడా లొంగిపోతే దాదాపు మావోయిస్ట్ పార్టీ శకం ముగిసినట్టేనని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ నుంచి ఉన్న మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చేశారు.

2004లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అయ్యారు గణపతి. నవంబర్ 10, 2018 వరకు ఆ పదవిలో కొనసాగారు. మావోయిస్టు కేంద్ర కమిటీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా గణపతి తన పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. ఈ మేరకు గణపతిని తన బాధ్యతల నుంచి తప్పించాలన్న సిఫార్సును కేంద్ర కమిటీ ఆమోదించింది. ఆ సమయంలో ఫిలిప్పీన్స్‌లో చికిత్స తీసుకున్నట్టు సమాచారం. గణపతిపై సుమారు రూ. 2.52 కోట్ల వరకు రివార్డు ఉంది. ఆ తర్వాత ఆయన స్థానంలో నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజ్ పార్టీ ఛీఫ్‌గా నియమితులయ్యారు.

ఇటీవల ఆసిఫాబాద్ అడవుల్లో దేవ్ జీతోపాటు మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నున్నె నరసింహారెడ్డి కూడా లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోతున్నట్టుగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పలువురు అగ్రనేతలు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలకు వస్తున్నారని నిఘా వర్గాలకు సమాచారవం వచ్చింది. దీంతో ఆపరేషన్ కగార్ 2 చేపట్టారు. కర్రెగుట్టల్లో పలువురు నక్సలైట్లు చనిపోయారు.

2026 మార్చి 31వ తేదీ నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. ఆ దిశగానే మెుదటి నుంచి ఆపరేషన్ కగార్ విషయంలో అగ్రెసివ్‌గా ముందుకు వెళ్తుంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా బలగాలు నిరంతరం కూంబింగ్ చేస్తున్నాయి. మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి బసవరాజ్‌ను ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఆ తర్వాత దేవ్‌జీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం లొంగిపోయారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More