TG IPS Transfers : ఐపీఎస్ అధికారుల బదిలీ - ఫ్యూచర్ సిటీ సీపీగా తరుణ్ జోషి, పూర్తి వివరాలు

IPS Transfers in Telangana : పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా 'ఫ్యూచర్ సిటీ' కమిషనర్‌గా తరుణ్ జోషి నియమితులయ్యారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌గా బి. సుమతి బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Published on: Apr 24, 2026, 18:46:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

IPS Transfers in Telangana : పోలీస్ శాఖలో కీలక బదిలీలు జరిగాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ బదిలీలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

ఐపీఎస్ అధికారుల బదిలీ - ఫ్యూచర్ సిటీ సీపీగా తరుణ్ జోషి
ఐపీఎస్ అధికారుల బదిలీ - ఫ్యూచర్ సిటీ సీపీగా తరుణ్ జోషి

1994 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిఖాగోయల్‌ను ప్రభుత్వం కీలకమైన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. ప్రస్తుతం ఆమె విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హోం సెక్రటరీగా బాధ్యతలు చేపట్టినప్పటికీ….. ఆమె తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను కూడా కొనసాగిస్తారు.

శిఖాగోయల్ స్థానంలో దేవేంద్ర సింగ్ చౌహాన్ (1997 బ్యాచ్) విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. అంతేకాకుండా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఆయన వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఆయన ఏడీజీ (పర్సనల్)గా పనిచేస్తున్నారు.

ఫ్యూచర్ సిటీ సీపీగా తరుణ్ జోషి

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న 'ఫ్యూచర్ సిటీ'కి పోలీస్ కమిషనర్‌గా తరుణ్ జోషిని (2004 బ్యాచ్) నియమించారు. ప్రస్తుతం ఆయన ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్నారు. ఫ్యూచర్ సిటీ ప్రస్తుత సీపీ జి. సుధీర్ బాబు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.

  • మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌గా ఉన్న అవినాష్ మొహంతిని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా బదిలీ చేశారు. ఆయన ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ డైరెక్టర్ బాధ్యతలతో పాటు ఏసీబీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారు.
  • ఐజీపీ (ఇంటెలిజెన్స్)గా ఉన్న బి. సుమతిని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
  • డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న షా నవాజ్ ఖాసింను మల్టీ-జోన్-II ఐజీపీగా బదిలీ చేశారు. ఆయన ఐజీపీ (పర్సనల్)గా అదనపు బాధ్యతలు చూస్తారు.
  • ఇంటెలిజెన్స్ ఐజీపీగా ఉన్న కార్తికేయకు అదనంగా ఐజీపీ (SIB) బాధ్యతలు నిర్వర్తిస్తారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More