షాబాద్ ఆరు హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి - కొత్తూరులో మృతదేహం లభ్యం..!

రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు వరుస హత్యల కేసులోని నిందితుడు రాజ్‌కుమార్ మృతి చెందాడు. కొత్తూరు మండలం పెంజర్ల సమీపంలోని ఒక వెంచర్‌లో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

Published on: Jul 13, 2026, 16:30:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన షాబాద్ వరుస హత్యల నిందితుడు ఎట్టకేలకు శవమై కనిపించాడు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా…. వరుసగా ఆరుగురిని పొట్టనబెట్టుకున్న సైకో కిల్లర్ ఎరకలి రాజ్‌కుమార్ (32) మరణించాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామం సరిహద్దుల్లో ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌లో రాజ్‌కుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

రాజ్‌కుమార్ (ఫైల్ ఫొటో)
రాజ్‌కుమార్ (ఫైల్ ఫొటో)

పెంజర్ల గ్రామ సరిహద్దుల్లో ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌లో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఆ మృతదేహం గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎరకలి రాజ్‌కుమార్‌దేనని ధృవీకరించుకున్నారు. స్థానికులు వెంటనే సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అతని మృతదేహాం పక్కన పురుగుల మందు బాటిల్ లభ్యమైనట్లు తెలిసింది.

నిందితుడు రాజ్‌కుమార్ షాబాద్ పరిసర ప్రాంతాల్లో వరుస హత్యలకు పాల్పడి నరమేథం సృష్టించిన సంగతి తెలిసిందే. మైనర్ బాలికపై ఘోర అఘాయిత్యానికి ఒడిగట్టిన ఈ సైకో కిల్లర్…. ఆ తర్వాత వరుసగా ఆరుగురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు.

పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన నేపథ్యంలో…. అతడు అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం ఇటు ప్రజల్లోనూ, అటు పోలీసు వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజ్‌కుమార్ ఎలా మరణించాడు? అతడు ఆత్మహత్య చేసుకున్నాడా..? వంటి కోణంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

ఇవాళే అంత్యక్రియలు…!

రాజ్ కుమార్ మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ఇవాళే పోస్టుమార్టం పూర్తి చేసి… అతని కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పగించి అంత్యక్రియలు పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు అతని స్వగ్రామాంలో( దైవాలగూడ ) ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More