...
...
Next Story

సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటన.. సీఈఓను అరెస్ట్ చేసిన పోలీసులు

సిగాచీ సంస్థ సీఈఓ అమిత్‌రాజ్ సిన్హాను పటాన్‌చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. పలు అంశాలపై విచారణ చేపట్టారు.

Published on: Dec 28, 2025, 21:36:00 IST
Advertisement

ఈ ఏడాది జూన్‌లో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా ప్లాంట్‌లో జరిగిన పేలుడు ఘటనలో 54 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను అరెస్టు చేసినట్లు పోలీసులు డిసెంబర్ 28 ఆదివారం తెలిపారు. ప్రమాదంపై నమోదైన కేసులో 2వ నిందితుడిగా సిన్హా ఉన్నారు. శనివారం రాత్రే అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

సిగాచీ ఘటన
సిగాచీ ఘటన

రిటైర్డ్ శాస్త్రవేత్తల బృందం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తూ.. తెలంగాణ హైకోర్టు సిగాచీ యాజమాన్యంపై తక్షణ చర్య తీసుకోవాలని ఆదేశించింది. జూన్ 30న సంగారెడ్డిలో జరిగిన పేలుడు ప్రమాదంలో 54 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారని, దీనిని తెలంగాణలో జరిగిన అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటనగా కోర్టు అభివర్ణించింది.

ఆరుగురిపై కేసు నమోదు చేశామని, వీరంతా ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందినవారని పోలీసులు తెలిపారు. దురదృష్టవశాత్తూ జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి పోలీసులు మా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అమిత్ రాజ్ సిన్హా, ఇతరులపై కేసు నమోదు చేశారని సిగాచీ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో తెలిపింది. నిబంధనల ప్రకారం, కోర్టు ముందు హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపింది.

'చట్టం ప్రకారం మా హక్కులు గౌరవించబడుతున్నాయని నిర్ధారిస్తూనే మేం చట్టపరమైన ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తున్నాం. ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉంది. చట్టపరమైన సలహాలకు లోబడి ముందుకు వెళ్తాం.' అని సిగాచీ ఇండస్ట్రీస్ తెలిపింది.

పరిశ్రమలో భద్రతా నిబంధనలను పట్టించుకోకుండా.. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో శనివారం రాత్రి సీఈఓను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. తర్వాత న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe