మీ వాట్సాప్‌కు ఈ మెసేజ్ వస్తే అది ఘోస్ట్ పెయిరింగ్ స్కామ్.. పోలీసులు హెచ్చరిక!
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త స్కామ్స్‌తో వస్తున్నారు. తాజాగా వాట్సాప్‌లో GhostPairing స్కామ్ జరుగుతోంది. దీనిపై హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు.
హైదరాబాద్ పోలీసులు ఘోస్ట్ పెయిరింగ్ అనే కొత్త వాట్సాప్ స్కామ్ గురించి వినియోగదారులను హెచ్చరించారు. ఇది నకిలీ లింక్‌ల ద్వారా ఖాతాలను హైజాక్ చేయడానికి యాప్ డివైజ్-లింకింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకుంటుంది. ఈ స్కామ్ సోషల్ ఇంజనీరింగ్‌పై ఆధారపడి ఉంటుంది. దీనిని సైబర్ భద్రతా నిపుణులు ఘోస్ట్ పెయిరింగ్ స్కామ్ అంటున్నారు. ఇది పాస్‌వర్డ్, ఓటీపీ లేదా సిమ్ మార్చడం అవసరం లేకుండా ఒక వ్యక్తి వాట్సాప్ ఖాతాను పూర్తిగా యాక్సెస్ చేస్తుంది. ఇందుకోసం డివైజ్-లింకింగ్ ఫీచర్‌ను వాడుకుంటుంది.

దీనిపై హైదరాబాద్ పోలీసులు ఒక సలహా జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్, వీసీ సజ్జనార్ ఎక్స్ ద్వారా పౌరులను కొత్త స్కామ్ గురించి హెచ్చరించారు. Hey, I just found your photo అని లింక్‌తో మెసేజ్ వస్తుంది. మీకు తెలిసిన వారి నుండి వచ్చినట్లు కనిపించినప్పటికీ దాన్ని క్లిక్ చేయవద్దు.
ఈ లింక్‌పై క్లిక్ చేస్తే వినియోగదారులు అధికారిక ఫేస్‌బుక్ లేదా వాట్సాప్ వెబ్ ఇంటర్‌ఫేస్‌లాగా కనిపించే ఫేక్ వెబ్‌పేజీకి వెళ్తుంది. కంటెంట్‌ను చూడటానికి ముందుగా వెరిఫై చేయాలని చెబుతుంది. బ్యాంక్ ఎండ్‌లో ఘోస్ట్ పెయిరింగ్ ప్రక్రియ మెుదలవుతుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలనే రిక్వెస్ట్ వస్తుంది. అనంతరం న్యూమరిక్ పెయిరింగ్ కోడ్‌ను వాట్సాప్ జనరేట్ చేస్తోంది. ఈ కోడ్‌ను వాట్సాప్‌లో నమోదు చేయాలని నకిలీ పేజీలోనే రిక్వెస్ట్ కనిపిస్తుంది. ఈ కోడ్ ఎంటర్ చేసిన వెంటనే స్కామర్ డివైజ్‌కు మన వాట్సాప్ లింక్ అయిపోతుంది. వాట్సాప్ మెుత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. ఇది మెుత్తం డివైజ్ లింకింగ్ ఫీచర్‌తో చేస్తారు.
GhostPairing పూర్తిగా సోషల్ ఇంజనీరింగ్‌పై ఆధారపడుతుంది. సైబర్ నేరగాళ్లు.. బాధితులను స్వయంగా డివైజ్‌ను ఆమోదించేలా మోసగిస్తారు. దీని వలన మీ వాట్సాప్ హ్యాక్ అయినట్టుగా గుర్తించడం కష్టతరం అవుతుంది. వాట్సాప్ ఖాతా వారి చేతుల్లోకి వెళ్లిన తర్వాత స్కామర్లు బాధితుడి పరిచయాలు, గ్రూప్ చాట్‌లకు అలా హానికరమైన లింక్‌లను పంపడానికి ఉపయోగిస్తారు.
'తెలిసిన వ్యక్తుల నుండి వచ్చే సందేశాలు క్లిక్ చేసే అవకాశం చాలా ఎక్కువ. దీని వలన స్కామ్ ఎక్కువగా జరుగుతుంది.' అని సైబర్ భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ స్కామ్ నుండి దూరంగా ఉండటానికి వినియోగదారులు వాట్సాప్ లింక్డ్ డివైజెస్‌ను తప్పనిసరిగా చెక్ చేస్తూ ఉండాలి. మీకు తెలియకుండా ఎందులోనైనా లింక్ అయి ఉంటే వెంటనే లాగౌట్ కొట్టేయండి. ఏవైనా తెలియనివి ఉంటే తొలగించుకోవాలి. కోడ్‌లను నమోదు చేయడం, QR కోడ్‌లను స్కాన్ చేయడం, వెరిఫై చేసుకోండిలాంటి మెసేజులు వస్తే వాటి జోలికి వెళ్లకూడదు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


