సింగరేణి కార్మికులకు శుభవార్త - ఉచితంగా రూ. 10 లక్షల బీమా పథకం వర్తింపు
సింగరేణి కార్మికులకు మరో శుభవార్త వచ్చేసింది. సహజ మరణానికీ రూ.10 లక్షల ఉచిత బీమా పథకం వర్తింపు జేయనున్నారు. యాజమాన్యం చొరవతో యూనియన్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది.
సింగరేణిలో కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్... మరో కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి యాజమాన్యం చేసిన సూచనల మేరకు…. సహజ మరణం చెందిన కార్మికులకు కూడా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది.

యూనియన్ బ్యాంకులో కార్పొరేట్ శాలరీ అకౌంట్ కలిగి ఉన్న కార్మికులు లేదా అధికారులు ఎవరైనా సరే మృతి చెందినట్లయితే వారికి రూ. 10 లక్షల బీమా సౌకర్యాన్ని వర్తింపజేయనుంది. ఈ మేరకు సింగరేణి సంస్థకు బ్యాంక్ యాజమాన్యం సమాచారం అందజేసింది.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమలులోకి రానున్నట్లు బ్యాంకు యాజమాన్యం పేర్కొంది. 2024 లో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సింగరేణి కార్మికులకు ఉచిత కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని యూనియన్ బ్యాంకు అమలు చేసింది.
ఉచితంగా రూ. 10 లక్షల బీమా …
ఈ ఒప్పందానికి కొనసాగింపుగా సహజ మరణానికి కూడా 10 లక్షల రూపాయల బీమాను వర్తింపజేస్తూ నిర్ణయించినట్లు యూనియన్ బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలలో 10 లక్షల బీమా పాలసీ తీసుకోవాలంటే కనీసం ఐదు వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే సింగరేణి యాజమాన్యం తీసుకున్న ప్రత్యేక చొరవతో…. ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా యూనియన్ బ్యాంకు సహజ మరణానికి 10 లక్షల బీమా పథకాన్ని అమలు జరిపింది.
కాగా సింగరేణి సంస్థలో కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలు జరుపుతున్న ఇతర బ్యాంకులు కూడా ఇదే విధంగా సహజ మరణానికి కూడా బీమా సౌకర్యాన్ని వర్తింపజేసేలా సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకుంటోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

