...
...
Next Story

SIR in Telangana : తెలంగాణ ఓటర్లకు అలర్ట్ - 'సర్' గడువు పొడిగింపు, సవరించిన షెడ్యూల్ ఇదే..!

SIR in Telangana : తెలంగాణలో ఎస్ఐఆర్ ( ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ మేరకు సవరించిన కొత్త షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది.

Published on: Jul 15, 2026 05:35 PM IST
Advertisement

తెలంగాణలోని ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక అప్డేట్ అందించింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision - SIR) గడువును పొడిగించింది.

ఆగస్టు 3 వరకు గడువు…

తెలంగాణ ఓటర్లకు అలర్ట్ - SIR గడువు పొడిగింపు… కొత్త షెడ్యూల్ ఇదే!
తెలంగాణ ఓటర్లకు అలర్ట్ - SIR గడువు పొడిగింపు… కొత్త షెడ్యూల్ ఇదే!

కొత్త(సవరించిన) షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు (BLO) చేపట్టే ఇంటింటి సర్వే గడువును ఆగస్టు 3, 2026 వరకు పొడిగించారు. గతంలో నిర్ణయించిన గడువు ముగియడంతో… క్షేత్రస్థాయిలో ప్రక్రియను మరింత పారదర్శకంగా పూర్తి చేసేందుకు ఈ అదనపు సమయాన్ని కేటాయించారు. అలాగే పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా ఆగస్టు 3 నాటికి పూర్తి చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

సవరించిన షెడ్యూల్ వివరాలు :

  • బీఎల్ఓల ఇంటింటి సర్వే : ఆగస్టు 3, 2026 వరకు పొడిగించారు.
  • పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ : ఆగస్టు 3, 2026 నాటికి పూర్తి చేయాలి.
  • ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ (Draft Publication) : ఆగస్టు 10, 2026 (సోమవారం) నాడు విడుదల చేస్తారు.
  • క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ : ఆగస్టు 10, 2026 నుండి సెప్టెంబర్ 9, 2026 వరకు ఓటర్లు తమ అభ్యంతరాలను తెలపవచ్చు లేదా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • క్లెయిములు, అభ్యంతరాల పరిష్కారం : ఆగస్టు 10, 2026 నుండి అక్టోబర్ 8, 2026 లోపు వీటిని అధికారులు పరిష్కరిస్తారు.
  • ఓటర్ల తుది జాబితా ప్రచురణ : అక్టోబర్ 12, 2026 (సోమవారం) నాడు తెలంగాణ ఓటర్ల తుది జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు.

ఈ సవరించిన షెడ్యూల్ సమాచారం…. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నింటికీ లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఈ మార్పులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించాలని స్పష్టం చేశారు. ఓటు హక్కు లేని వారు, మార్పులు చేర్పులు చేయాలనుకునే వారు ఈ పొడిగించిన గడువును ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe