ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు అలర్ట్.. సర్ గడువు పొడిగింపు.. సవరించిన షెడ్యూల్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు కీలక అప్డేట్ వచ్చింది. SIR గడువు పొడిగించారు. మరో 10 రోజులు పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది. సవరించిన షెడ్యూల్ చూడండి.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) కార్యక్రమానికి సంబంధించి భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి అభ్యర్థన మేరకు ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను సవరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారికి జులై 14, 2026 నాటి లేఖ ద్వారా అధికారిక ఆదేశాలను పంపింది.

01.07.2026 నాటికి అర్హత కలిగిన కొత్త ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పుల కోసం ఈ ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో మారిన తాజా సవరించిన షెడ్యూల్ వివరాలు చూడండి. నిజానికి జులై 14తో తేదీ ముగియాల్సి ఉంది. మరో 10 రోజులు పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల ప్రకారం సవరించిన ముఖ్యమైన తేదీలు, కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.
కొత్త షెడ్యూల్
బి.ఎల్.ఓ (BLO)ల ద్వారా ఇంటింటి సర్వే: ఈ గడువును 15.06.2026 నుండి 24.07.2026 వరకు సవరించారు.
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ / పునర్వ్యవస్థీకరణ: ఈ ప్రక్రియను 24.07.2026 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది.
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ (Draft Publication): 31.07.2026న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.
అభ్యంతరాలు, క్లెయిమ్‌ల దాఖలు కాలపరిమితి: కొత్త ఓటర్ల నమోదు, మార్పులపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లను సమర్పించడానికి 31.07.2026 నుండి 30.08.2026 వరకు సమయం కేటాయించారు.
నోటీసుల దశ / క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం: సమర్పించిన అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను 31.07.2026 నుండి 28.09.2026 వరకు చేపడతారు.
తుది ఓటర్ల జాబితా ప్రచురణ : అన్ని సవరణలు పూర్తి చేసిన అనంతరం తుది ఓటర్ల జాబితాను 03.10.2026న అధికారికంగా ప్రచురిస్తారు.
అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాలు
ఈ సవరించిన నియామక షెడ్యూల్, పొడిగించిన గడువు సమాచారాన్ని సంబంధిత అధికారులు, సిబ్బంది అందరికీ తక్షణమే చేరవేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అదేవిధంగా అందుబాటులో ఉన్న అన్ని రకాల మీడియా మాధ్యమాల ద్వారా ఈ కొత్త తేదీలను విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సైతం ఈ సవరించిన షెడ్యూల్ కాపీని లిఖితపూర్వకంగా అందజేయాలని ఈసీఐ తన లేఖలో పేర్కొంది.
నిజానికి ఎన్నికల సంఘం మెుదట ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జులై 14తో తేదీ ముగియాల్సి ఉంది. చాలా ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ, డిజిటైజేషన్ కాలేదు. ఈ కారణంగా గడువును పొడిగిస్తూ.. ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. దీంతో 10 రోజులు గడువు పెంచుతూ అనుమతి వచ్చింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


