AP Sports Tournament : యువ క్రీడాకారులకు మంచి ఛాన్స్ - ఈనెల 15 నుంచి పోటీలు, షెడ్యూల్ ఇలా

Sports Authority of Andhra Pradesh  : ఆంధ్రప్రదేశ్‌లో యువ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0' పోటీలను నిర్వహిస్తోంది. జూలై 15 నుంచి ఈ పోటీలు ప్రారంభమవుతాయి.

Published on: Jul 14, 2026, 09:22:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Amaravati Championship 2.0 : ఆంధ్రప్రదేశ్‌ను క్రీడల పరంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలనే బలమైన సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక అడుగు వేసింది. గ్రామీణస పట్టణ ప్రాంతాల్లో దాగున్న క్రీడా నైపుణ్యాలను గుర్తించి, వారిని అంతర్జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో జూలై 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా "అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0" మహా క్రీడా పోటీలను ప్రారంభించనున్నారు.

ఏపీలో అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 క్రీడా పండుగ
ఏపీలో అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 క్రీడా పండుగ

రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగనుంది. క్షేత్రస్థాయి నుంచి ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి, వారికి సరైన వేదికను కల్పించడమే ఈ ఛాంపియన్‌షిప్ ప్రధాన ఉద్దేశం.

3 దశల్లో పోటీలు.. క్రీడల పూర్తి షెడ్యూల్ ఇదే!

  • జూలై 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది.
  • ప్రాథమిక ఎంపికల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15 వరకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు.
  • చివరగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆగస్టు 20 నుంచి ఆగస్టు 25 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయి.
  • జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 29న విజేతలకు ఘనంగా బహుమతులను అందజేస్తారు.

ఈ ఛాంపియన్‌షిప్‌లో అండర్-17 (17 ఏళ్ల లోపు), అండర్-23 (23 ఏళ్ల లోపు) విభాగాల్లో మొత్తం 12 రకాల క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏకంగా రూ.94 లక్షల భారీ నగదు బహుమతులను కేటాయించింది. ఈ పోటీల ద్వారా దాదాపు 3 లక్షల మందికి పైగా విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

"అండర్-17, అండర్-23 విభాగాల ద్వారా మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు కొత్త ప్రతిభను వెలికితీస్తాం. ఆంధ్రప్రదేశ్‌ను 'క్రీడా ఆంధ్రప్రదేశ్'గా మార్చడమే మా సంకల్పం" అని శాప్ (SAAP) చైర్మన్ రవి నాయుడు స్పష్టం చేశారు.

"క్రీడాకారులు పతకాలు సాధించిన తర్వాతే కాదు... వాటిని సాధించేందుకు వారు పడే కష్టంలో, శిక్షణ సమయంలోనే వారికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిశ్చయించారు. కామన్‌వెల్త్, ఆసియా క్రీడలకు ఎంపికైన క్రీడాకారులను మా ప్రభుత్వం ముందుగానే ప్రోత్సహిస్తోంది" అని శాప్ చైర్మన్ వివరించారు.

క్రీడాకారుల అభివృద్ధి కేవలం ప్రభుత్వంతోనే ముడిపడి ఉండకుండా, స్థానిక పారిశ్రామికవేత్తలు, దాతల సహకారాన్ని కూడా జోడించి మరింత మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అమరావతి ఛాంపియన్‌షిప్ విజయవంతానికి మీడియా సైతం తమ వంతు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, క్రీడాకారులతో పాటు క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ (DSDOలు), క్రీడా శిక్షకులను (కోచ్‌లు) సైతం రాష్ట్ర స్థాయిలో సన్మానించి వారి సేవలను గుర్తించనున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More