...
...
Next Story

SIR in Telangana : తెలంగాణలోనూ 'సర్' - ఏప్రిల్‌ లేదా మేలో షెడ్యూల్...!

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) షెడ్యూల్ రానుంది. ఏప్రిల్-మే నెలల్లో ఎస్ఐఆర్ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డి చెప్పారు.

Published on: Feb 6, 2026, 11:15:17 IST
Advertisement

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఓటర్ల సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలోనూ ఈ ప్రక్రియ చేపట్టేందుకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుండగా…. తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్‌ ఏప్రిల్‌, -మే నెలల మధ్య వెలువడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఈఓ సుదర్శన్​రెడ్డి పేర్కొన్నారు.

పారదర్శకంగా ఉండాలి - సీఈవో సుదర్శన్ రెడ్డి

తెలంగాణలో 'సర్‌' షెడ్యూల్‌ - ఈసీ ఏర్పాట్లు
తెలంగాణలో 'సర్‌' షెడ్యూల్‌ - ఈసీ ఏర్పాట్లు

సర్(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను అత్యంత పారదర్శకగా, పకడ్బందీగా నిర్వహించాలని చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సర్​ రాష్ట్రంలోని ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు కనీసం ఒక బూత్‌ లెవెల్‌ ఏజెంట్‌ (బీఎల్‌ఏ)ను రాజకీయ పార్టీలు తప్పనిసరిగా నియమించుకోవాలన్నారు.

గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. బూత్ లెవల్ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ కొనసాగుతోందని…. తెలంగాణతో సహా మిగిలిన రాష్ట్రాల షెడ్యూల్ను 2026 ఏప్రిల్-మే నెలల్లో ప్రకటిస్తారని రాజకీయ పార్టీలకు తెలియజేశారు.

నోటిఫై చేసిన తర్వాత రివిజన్ కోసం పరిమిత సమయం మాత్రమే అందుబాటులోఉంటుందని… రాష్ట్రంలో ఇప్పటికే సన్నాహక పనులు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. ఓటర్ల జాబితాల సవరణ సమయంలో ఖచ్చితత్వం, పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. సమస్యలను సకాలంలో పరిష్కరించడంలో సహాయపడటానికి ప్రతి పోలింగ్ బూత్ లో కనీసం ఒక బిఎల్ఎ ఉండాలని సీఈవో సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) సమయంలో…. బిఎల్ఓలు ప్రతి పోలింగ్ ప్రాంతానికి మూడు నుంచి నాలుగుసార్లు సందర్శించే అవకాశం ఉంటుందన్నారు. మొదటి సందర్శనలో లెక్కింపు ఫారాలు పంపిణీ చేయబడతాయని తెలిపారు. ఎవరైనా ఓటర్లు మ్యాపింగ్‌లో మిగిలిపోతే ఎస్‌ఐఆర్‌ సమయంలో తమ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే తమ లక్ష్యమన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks