ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం - KCRకు సిట్‌ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ అయ్యాయి. శుక్రవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నందినగర్ లోని ఆయన నివాసంలో ఈ నోటీసులు అందించారు.

Published on: Jan 29, 2026, 13:43:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావును విచారించగా… తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసింది.

కేసీఆర్
కేసీఆర్

గురువారం నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు… నోటీసులు అందజేశారు.శుక్రవారం (రేపు) మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.వయసురీత్యా విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని…. మీరు కోరిన చోటే విచారిస్తామని కేసీఆర్‌కు తెలిపారు.

కేసీఆర్‌ ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో ఉన్నారు. అయితే ఇవాళ ఉదయం సిట్‌ అధికారులు అక్కడికే వెళ్లి నోటీసులు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అక్కడికి వెళ్లకుండా… బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు.

రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత… ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. గత బీఆర్ఎస్ హయాంలో కొందరు అధికారులు, నేతలు ట్యాంపింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ… విచారణ కూడా జరిపిస్తోంది. ఇందుకోసం ఇటీవలనే హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ కూడా ఏర్పాటు చేసింది.

సజ్జనార్ నేతృత్వంలోని సిట్ టీమ్… దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చి.. విచారణ కూడా జరిపింది. అవసరమైతే మళ్లీ కూడా పిలుస్తామని… ఇటీవలే సీపీ సజ్జనార్ కూడా ప్రకటించారు. ముందుగా హరీశ్ రావుని విచారించిన సిట్… ఆ తర్వాత కేటీఆర్ ను విచారించింది. దాదాపు 7 గంటలకుపైగా ప్రశ్నించింది. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుని కూడా సిట్ విచారించింది. ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటం అత్యంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More