ఫోన్ ట్యాపింగ్ కేసు : సంతోష్‌ రావును 7 గంటలకుపైగా విచారించిన సిట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్‌ రావును 7 గంటలకుపైగా సిట్ విచారించింది. అనేక అంశాలపై సంతోష్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు.

Updated on: Jan 28, 2026, 09:51:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావు మంగళవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ముందు హాజరయ్యారు. ఏడు గంటలకు పైగా ఆయనను అధికారులు ప్రశ్నించారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సంతోష్‌ను కేసుకు సంబంధించిన అనేక అంశాలపై దర్యాప్తు అధికారులు పరిశీలించారు. దాదాపు రాత్రి 11 గంటల వరకు విచారణ కొనసాగింది.

సంతోష్ రావు
సంతోష్ రావు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా చెప్పే సంతోష్ రావు సిట్ ముందు హాజరుకావడం రాజకీయ చర్చకు దారితీసింది. నివేదికల ప్రకారం, కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు.. బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB) సీనియర్ అధికారుల మధ్య మధ్యవర్తిగా వ్యవహరించారా? అని సంతోష్ రావును ప్రశ్నించినట్లు తెలిసింది.

మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుతో ఆయన సంభాషణలపై, వారి కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీ, ఉద్దేశాలపై దర్యాప్తు అధికారులు స్పష్టత కోరినట్లు చెబుతున్నారు. ప్రభాకర్ రావు పదవీ విరమణ తర్వాత తీసుకున్న పరిపాలనా నిర్ణయాల గురించి, గత ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన పొడిగింపు గురించి సంతోష్‌ను సిట్ ప్రశ్నించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలపై నిఘా ఆరోపణలపై కూడా దర్యాప్తు బృందం దృష్టి సారించింది. ఈ ఆపరేషన్ గురించి సంతోష్‌కు ఎంతవరకు తెలుసో.. తెలుసుకోవడానికి సిట్ ప్రయత్నించింది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌‌గా ప్రభాకర్‌ రావు నియామకంపై నిర్ణయం ఎవరిదని సంతోష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. సంతోష్ రావు ముందు ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి కొన్ని ఆధారాలు ముందు పెట్టి అడిగినట్టుగా సమాచారం.

అంతేకాకుండా దర్యాప్తు అధికారులు సంతోష్ రావును ఎన్నికల బాండ్ల గురించి, ముఖ్యంగా వ్యాపార సంస్థల నుండి బలవంతపు పద్ధతుల ద్వారా నిధులు సేకరించబడ్డాయా అని ప్రశ్నించారని తెలుస్తోంది. గతంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు కూడా ఇలాంటి ప్రశ్నలు వేసినట్లుగా ప్రచారం జరిగింది.

ముగ్గురు సీనియర్ బీఆర్ఎస్ నాయకులను ఇప్పటికే ప్రశ్నించడంతో తెలంగాణలో రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ కేసుపై దర్యాప్తు బృందం ముమ్మరంగా విచారణ చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారణ కోసం పిలిపించాలని సిట్ ఇప్పుడు పరిశీలిస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు. రాబోయే రోజుల్లో దర్యాప్తు ఎలాంటి మలుపులు తీసుకుంటుదోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More