తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే?
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించింది. ఏ తేదీలో పోలింగ్ జరగనుందో ఇక్కడ చూడండి.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 7నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరగనుంది.

రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఎన్నికలలో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. జనవరి 28న ఎన్నికల నోటీసు జారీ అవుతుంది. తర్వాత నామినేషన్ల స్వీకరణతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరిస్తారు.
ముఖ్యమైన తేదీలు
- నామినేషన్ల ప్రారంభం-28.01.2026(ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు).
- నామినేషన్ల ముగింపు తేదీ-30.01.2026(సాయంత్రం 5:00 గంటల వరకు).
- పోలింగ్ తేదీ-11.02.2026 (ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు).
- ఓట్ల లెక్కింపు-13.02.2026 (ఉదయం 8:00 గంటల నుంచి ఉంటుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు).
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జనవరి 30, నామినేషన్ల పరిశీలన జనవరి 31న జరుగుతుంది. నామినేషన్లు దాఖలు చేసి చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితాను పరిశీలన తర్వాత అదే రోజున ప్రచురిస్తారు.
నామినేషన్ల తిరస్కరణకు సంబంధించి అభ్యర్థులు ఫిబ్రవరి 1న అప్పీళ్లు దాఖలు చేసుకోవచ్చు. అప్పీళ్ల పరిష్కార ప్రక్రియ ఫిబ్రవరి 2 నాటికి పూర్తవుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 3, పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రచురిస్తారు.
ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఒకవేళ రీపోలింగ్ ఎక్కడైనా జరిగితే ఫిబ్రవరి 12న పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.
ఎన్నికలు సజావుగా జరిగేలా చూసుకోవాలని, ఎన్నికల షెడ్యూల్‌ను పాటించాలని ఎన్నికల అధికారులను కమిషన్ ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది

.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


