మంత్రులకు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు.. ఎక్కడ ఏ మంత్రి ఇన్ఛార్జి?

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మంత్రులకు మున్సిపల్ ఎన్నికలు బాధ్యతలను అప్పగించారు.

Published on: Jan 19, 2026, 14:25:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

త్వరలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కసరత్తు జరుగుతోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు ఇన్ఛార్జులుగా మంత్రులను నియమించింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జులను నియమించారు. మంగళవారం నుంచి ఎన్నికల సన్నాహక సమావేశాలు మెుదలుపెట్టాలన్నారు.

మున్సిపల్ ఎన్నికలు (Facebook)
మున్సిపల్ ఎన్నికలు (Facebook)

15 నియోజకవర్గాలకు 15 మందిని ఇన్ఛార్జులుగా నియమించింది కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి.. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. త్వరలో ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఫిబ్రవరి మెుదటి వారం లేదంటే.. రెండో వారంలో ఎన్నికలు జరుగుతాయనే చర్చ నడుస్తోంది.

ఇన్ఛార్జిల జాబితా

  • మల్కాజిగిరి-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • చేవెళ్ల-దుద్దిళ్ల శ్రీధర్ బాబు
  • ఖమ్మం-కొండా సురేఖ
  • మహబూబాబాద్-పొన్నం ప్రభాకర్
  • మహబూబ్‌నగర్-దామోదర రాజనరసింహ
  • నాగర్‌కర్నూల్-వాకిటి శ్రీహరి
  • జహీరాబాద్-అజారుద్దీన్
  • మెదక్-వివేక్ వెంకటస్వామి
  • నల్గొండ-అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  • భువనగిరి-సీతక్క
  • నిజామాబాద్-ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • కరీంనగర్-తుమ్మల నాగేశ్వరరావు
  • వరంగల్-పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • పెద్దపల్లి-జూపల్లి కృష్ణారావు
  • ఆదిలాబాద్-ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

తెలంగాణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మిగిలిన పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు పెండింగ్‌లో ఉన్న చట్టపరమైన, పరిపాలనా సమస్యలు కారణంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఎన్నికలు సంబంధించి.. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది.

రిజర్వేషన్లు ఖరారు

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. కీలకమైన హైదరాబాద్ మేయర్ పీఠాన్ని మహిళా జనరల్ కు కేటాయించగా.. గ్రేటర్‌ వరంగల్‌ జనరల్‌‌గా నిర్ణయించారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌-బీసీ జనరల్‌, కొత్తగూడెం కార్పొరేషన్‌-ఎస్టీ జనరల్‌, రామగుండం కార్పొరేషన్‌- ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. నల్గొండ కార్పొరేషన్‌-మహిళా జనరల్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్‌- మహిళా జనరల్‌, మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌- బీసీ మహిళ, మంచిర్యాల కార్పొరేషన్‌- బీసీ జనరల్‌, ఖమ్మం కార్పొరేషన్‌-మహిళా జనరల్‌‌గా నిర్ణయించారు.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందులో 25,62,369 మంది పురుష ఓటర్లు, 26,80,014 మంది మహిళా ఓటర్లు ఉండగా.. 640 మంది ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More