హైదరాబాద్ నుంచి ఈ రూట్‌లో అన్‌రిజర్వ్‌డ్ స్పెషల్ రైళ్లు.. హాల్టింగ్ స్టేషన్లు!
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాలకు నడుస్తుండగా.. తాజాగా మరికొన్ని అన్‌రిజర్వ్‌డ్ స్పెషల్ ట్రైన్స్‌ను ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే నడుస్తున్న స్పెషల్ ట్రైన్లను పొడిగిస్తూ వస్తోంది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ-కర్ణాటక మధ్య కొత్త ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు అన్‌రిజర్వ్‌డ్ అని వెల్లడించింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగుకుండా ఈ మేరకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నది.

ఇందులో భాగంగా కొత్తగా హైదరాబాద్-వాడి మధ్య ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే అనౌన్స్ చేసింది. ఇవి అన్‌రిజర్వ్‌డ్ ట్రైన్స్ అని స్పష్టంగా చెప్పింది. సాధారణ ప్రజలు ఈ రూట్‌లో హాయిగా ప్రయాణించవచ్చు. మెుత్తం 4 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జూన్ 29వ తేదీన ఈ రైళ్లు ప్రారంభమవుతాయి.
రైళ్ల షెడ్యూల్
07175 హైదరాబాద్-వాడి మధ్య రైలు జూన్ 29వ తేదీన సోమవారం హైదరాబాద్‌లో ఉదయం 9.30 గంటలకు బయల్దేరుతుంది. వాడికి మధ్యాహ్నం 2.30కి చేరుకుంటుంది.
07176 వాడి-హైదరాబాద్ మధ్య జూన్ 29వ తేదీన వాడి నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
07175 హైదరాబాద్-వాడి మధ్య జూలై 1వ తేదీన బుధవారం ఉదయం ఐదు గంటలకు హైదరాబాద్ నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. ఉదయం పది గంటలకు వాడి చేరుకుంటుంది.
అలాగే 07176 నెంబర్ రైలు వాడి-హైదరాబాద్ నడుమ జూలై 1న ఉదయం 11.40కి బయల్దేరుతుంది. సాయంత్రం 4.35కి హైదరాబాద్ చేరుకుంటుంది.
రైళ్లు ఆగే స్టేషన్లు
22 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ఈ ట్రైన్ ఉంటుంది. పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. బేగంపేట, సనత్‌నగర్, హఫీజ్‌పేట, లింగంపల్లి, నాగులపల్లి, శంకర్‌పల్లి, గుళ్లగూడ, వికారాబాద్, గొడమూర్గ, ధరూర్, రూక్మాపూర్, తాండూర్, మంతట్టి, నవాంద్గి, కుర్కుంట, సెడం, మళ్ఖేడ్ రోడ్, చిత్తాపూర్ స్టేషన్లలో ఆగుతుంది.
బిలాస్‌పూర్ - బెంగళూరు కంటోన్మెంట్ ప్రత్యేక రైలు
దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం.. బిలాస్‌పూర్ - బెంగళూరు కంటోన్మెంట్(ట్రైన్ నంబర్ 08263) మధ్య ప్రత్యేక రైలును నడపనుంది. 2026 జూన్ 12వ తేదీన ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మరియు కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రధాన రైల్వే స్టేషన్ల మీదుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
ఏపీ, తెలంగాణలో ఆగే స్టేషన్లు
ఈ సమ్మర్ స్పెషల్ రైలు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగాప్రయాణిస్తుండటంతో ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ బెంగళూరుకు వెళ్లే ఉద్యోగులు, కుటుంబాలకు ఈ ప్రత్యేక రైలు సర్వీసు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.
ఈ ట్రైన్ సిర్పూర్ కాజగ్ దనర్, మంచిర్యాల, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, మంత్రాలయం రోడ్డు, గుంతకల్లు, గుత్తి, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్ స్టేషన్లలో ఆగుతుంది.
ఈ రైలులో ప్రయాణించాలనుకునే వారు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా కానీ, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కానీ ముందస్తుగా తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు సూచించారు. వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


