...
...
Next Story

Railway Updates : నార్త్ వైపు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్‌లో నడిచే రైళ్లు పొడిగింపు.. షెడ్యూల్ చూడండి!

Railway Updates : ప్రయాణికులకు రైల్వే శాఖ అప్డేట్ ఇచ్చింది. కాచిగూడ-శ్రీ గంగానగర్-కాచిగూడ మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సేవలను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది.

Published on: Jun 11, 2026 06:02 PM IST
Advertisement

ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయాణించే తెలుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారి సౌకర్యార్థం గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన కాచిగూడ – శ్రీగంగానగర్ ట్రైన్ సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు ఈ రూట్‌లో సేవలు అందుకోవచ్చు. ఉత్తరభారతం వైపు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఈ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. రైలు నెంబర్ 07053/07054తో నడిచిన స్పెషల్ రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే పొడిగించింది. ఈ కొత్త సర్వీసులు జూలై నెలలో నడవనున్నాయి.

కాచిగూడ-శ్రీగంగానగర్ ట్రైన్స్ షెడ్యూల్

దక్షిణ మధ్య రైల్వే ట్రైన్స్ పొడిగింపు
దక్షిణ మధ్య రైల్వే ట్రైన్స్ పొడిగింపు

ట్రైన్ నంబర్ 07053 (కాచిగూడ - శ్రీగంగానగర్) ఈ రైలు జూలైలో రెండు సర్వీసులు నడవనుంది. 11.07.2026 రోజున శనివారం కాచిగూడ నుంచి బయలుదేరుతుంది. మరో ట్రైన్ 18.07.2026న కాచిగూడ నుంచి వెళ్తుంది.

ఇక ట్రైన్ నంబర్ 07054 (శ్రీగంగానగర్ - కాచిగూడ ) రైలు 14.07.2026 మంగళవారం రోజున శ్రీగంగానగర్ నుంచి పయనమవుతుంది. ఇంకోటి 21.07.2026న అక్కడ నుంచి కాచిగూడ వస్తుంది.

మెుత్తం నాలుగు సర్వీసులు నడవనున్నాయి. ఈ రైలుకు సంబంధించిన అదనపు సమాచారం, సీట్ల లభ్యత, టికెట్ బుకింగ్ వివరాల కోసం ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ (IRCTC) అధికారిక వెబ్‌సైట్ ను చూడొచ్చు. లేదా దక్షిణ మధ్య రైల్వే అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలను సందర్శించవచ్చని అధికారులు తెలిపారు.

హైదరాబాద్-వాడి రైళ్లు

కొత్తగా హైదరాబాద్-వాడి మధ్య ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే అనౌన్స్ చేసింది. ఇవి అన్‌రిజర్వ్‌డ్ ట్రైన్స్ అని స్పష్టంగా చెప్పింది. సాధారణ ప్రజలు ఈ రూట్‌లో హాయిగా ప్రయాణించవచ్చు. మెుత్తం 4 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జూన్ 29వ తేదీన ఈ రైళ్లు ప్రారంభమవుతాయి.

రైళ్ల షెడ్యూల్

07176 వాడి-హైదరాబాద్ మధ్య జూన్ 29వ తేదీన వాడి నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

07175 హైదరాబాద్-వాడి మధ్య జూలై 1వ తేదీన బుధవారం ఉదయం ఐదు గంటలకు హైదరాబాద్ నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. ఉదయం పది గంటలకు వాడి చేరుకుంటుంది.

అలాగే 07176 నెంబర్ రైలు వాడి-హైదరాబాద్ నడుమ జూలై 1న ఉదయం 11.40కి బయల్దేరుతుంది. సాయంత్రం 4.35కి హైదరాబాద్ చేరుకుంటుంది.

రైళ్లు ఆగే స్టేషన్లు

22 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ఈ ట్రైన్ ఉంటుంది. పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. బేగంపేట, సనత్‌నగర్, హఫీజ్‌పేట, లింగంపల్లి, నాగులపల్లి, శంకర్‌పల్లి, గుళ్లగూడ, వికారాబాద్, గొడమూర్గ, ధరూర్, రూక్మాపూర్, తాండూర్, మంతట్టి, నవాంద్గి, కుర్కుంట, సెడం, మళ్ఖేడ్ రోడ్, చిత్తాపూర్‌ స్టేషన్లలో ఆగుతుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe