Railway Updates : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్ - ఈ రూట్లలో నడిచే పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు..! తేదీలివే
SCR MEMU Passenger Train Cancellations : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇఛ్చింది. పలు మరమ్మత్తు పనుల కారణంగా… పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. అంతేకాకుండా హైదరాబాద్ పరిధిలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేసినట్లు పేర్కొంది.
ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. పలు మరమ్మత్తు పనులతో పాటు ఇతర కార్యక్రమాల కారణంగా… పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. మార్చి 20,21 తేదీల్లో ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటించింది.

ప్యాసింజర్ రైళ్లు రద్దు - వివరాలు
- ట్రైన్ నెంబర్ 67759 - సికింద్రాబాద్ - చిత్తాపూర్.
- ట్రైన్ నెంబర్ 67760 చిత్తాపూర్ - సికింద్రాబాద్.
- ట్రైన్ నెంబర్ 67765 కాజీపేట - డోర్నకల్.
- ట్రైన్ నెంబర్ 67767 డోర్నకల్ - విజయవాడ.
- ట్రైన్ నెంబర్ 67768 విజయవాడ - డోర్నకల్.
- ట్రైన్ నెంబర్ 67766 డోర్నకల్ - కాజీపేట.
- ట్రైన్ నెంబర్ 67769 విజయవాడ - గుంటూరు.
- ట్రైన్ నెంబర్ 67770 గుంటూరు - విజయవాడ.
- ట్రైన్ నెంబర్ 67761 సికింద్రాబాద్ - వరంగల్.
- ట్రైన్ నెంబర్ 67762 వరంగల్ - సికింద్రాబాద్.
MMTS రైళ్లు రద్దు :
మరోవైపు హైదరాబాద్ నగర పరిధిలో నడిచే పలు MMTS రైళ్లు కూడా రద్దు అయ్యాయి. మరమ్మత్తు పనుల కారణంగా… ఇవాళ, రేపు పలు రూట్లలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మరో ప్రకటన ద్వారా పేర్కొంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.
రద్దు చేసిన ట్రైన్స్ - తేదీలు….
- 47191 లింగంపల్లి - ఫలక్ నుమా : 20.03.2026.
- 47170 ఫలక్ నుమా - లింగంపల్లి : 20.03.2026.
- 47207 ఫలక్ నుమా - తెల్లాపూర్ : 20.03.2026 నుంచి 21.03.2026.
- 47159 తెల్లాపూర్ - ఉందానగర్ : 20.03.2026 నుంచి 21.03.2026.
- 47187 లింగంపల్లి - ఫలక్ నుమా : 20.03.2026.
- 47166 ఫలక్ నుమా - లింగంపల్లి 20.03.2026.
- 47192 లింగంపల్లి - ఫలక్ నుమా : 20.03.2026 నుంచి 21.03.2026.
- 47167 ఫలక్ నుమా - లింగంపల్లి : 20.03.2026 నుంచి 21.03.2026.
- 47220 ఫలక్ నుమా - లింగంపల్లి : 20.03.2026 నుంచి 21.03.2026.
- 47228 మేడ్చల్ - సికింద్రాబాద్ : 20.03.2026 నుంచి 21.03.2026.
- 47229 సికింద్రాబాద్ - మేడ్చల్ : 20.03.2026 నుంచి 21.03.2026.
- 47237 మేడ్చల్ - సికింద్రాబాద్ : 20.03.2026 నుంచి 21.03.2026.
- 47238 సికింద్రాబాద్ - మేడ్చల్ : 20.03.2026 నుంచి 21.03.2026.
- 47242 మేడ్చల్ - సికింద్రాబాద్ : 20.03.2026 నుంచి 21.03.2026.
- 47245 సికింద్రాబాద్ - మేడ్చల్ : 20.03.2026 నుంచి 21.03.2026.
- 47235 ఘటకేసర్ - సనత్‌నగర్ :20.03.2026 నుంచి 21.03.2026.
- 47236 సనత్‌నగర్ - ఘట్ కేసర్ : 20.03.2026 నుంచి 21.03.2026.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

