...
...
Next Story

కొత్త సర్పంచ్‌‌లకు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్.. రూ.10 లక్షలు, రూ.5 లక్షలు : సీఎం

కొత్త సర్పంచ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లకు నేరుగా నిధులు అందిస్తామని ప్రకటించారు.

Published on: Dec 24, 2025, 18:06:24 IST
Advertisement

కొడంగల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్త సర్పంచులను అభినందించి, శాలువాలతో సత్కరించారు. గ్రామాభివృద్ధికి సర్పంచుల పాత్ర కీలకమని సీఎం పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లకు నేరుగా నిధులు అందిస్తామని ప్రకటించారు. 'పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామాలకు రూ.5లక్షల చొప్పున ఇస్తాం. సర్పంచ్‌లకు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద అందిస్తాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధం లేకుండా నిధులు ఇస్తాం. గ్రామాల్లో అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తాం.' అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

మీ సహకారంతోనే ఇంతటివాడిని అయ్యానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2009 నుంచి తనను భుజాలపై మోశారని గుర్తుచేసుకున్నారు. కొడంగల్‌ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుటుందని చెప్పారు. గ్రామాల్లో వివక్ష లేకుండా పరిపాలన సాగాలని సూచించారు. గ్రామాల్లో పార్టీలు పంతాలకు పోకుండా కలిసికట్టుగా పని చేయాలని హితవు పలికారు సీఎం. సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి పాటుపడేలా ఉండాలన్నారు. ప్రజలకు ఉన్నతమైన, నాణ్యమైన సేవలు అందించాలన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాలు అభివృద్ధి చెందాలని కోరారు.

'కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ప్రతీ గ్రామం, తండాకు రోడ్లను పూర్తి చేస్తాం. గుడి, బడి, తాగునీరు, పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులను అందిస్తాం. నిరుద్యోగులకు ఉపయోగపడేలా ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేస్తాం. కొత్త సర్పంచ్‌లు గ్రామాల్లో ప్రజలు విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రజలకు సేవ చేయాలి. పేదలకు పథకాలు చేరినప్పుడే నిజమైన పాలన అందుబాటులో ఉంటుంది. కొడంగల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టిన నాయకులను అభినందిస్తున్నా. ఇక్కడ సమస్యల పరిష్కారానికి మా సోదరుడు తిరుపతిరెడ్డి అందుబాటులో పెట్టాను.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe