మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.
Special TG TET 2026 : తెలంగాణ స్పెషల్ టెట్ అప్డేట్ - ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల
ఇన్-సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించిన స్పెషల్ టీజీ-టెట్ ప్రాథమిక కీని అధికారులు విడుదల చేశారు. అభ్యంతరాలను నవంబర్ 28 సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో పంపాలి.
ఇన్-సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించిన స్పెషల్ టీజీ-టెట్ (2026-2) పరీక్షల ప్రాథమిక కీని అధికారులు విడుదల చేశారు. ఈ నెల 22న ఆన్లైన్ విధానంలో రాసిన పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ అందుబాటులోకి వచ్చిందని స్పెషల్ టీజీ-టెట్ కన్వీనర్ జీ రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.

పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రాథమిక కీని పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ https://schooledu.telangana.gov.in ద్వారా పరిశీలించవచ్చు. కీలోని ప్రశ్నలు లేదా సమాధానాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఆలస్యం చేయకుండా స్పందించాలి. నవంబర్ 28 సాయంత్రం 5 గంటల లోపు వెబ్సైట్లోని లింక్ ద్వారా ఆన్లైన్లో అభ్యంతరాలను సమర్పించాలని కన్వీనర్ సూచించారు.
ఇక అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలను స్వీకరించే అవకాశం ఉండదు కాబట్టి అభ్యర్థులు నిర్ణీత సమయంలోపు తమ అభ్యంతరాలను నమోదు చేయాలి. తుది కీ రూపకల్పనలో అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రాథమిక కీని ఇలా చెక్ చేసుకోవచ్చు
- ముందుగా https://tgtet.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని స్పెషల్ టీజీ టెట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ ఓపెన్ అయ్యే కొత్త విండోలోని ప్రాథమిక కీ లింక్ పై నొక్కాలి.
- ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 వివరాలు సబ్జెక్టుల ప్రకారం ఉంటాయి.
- మీరు హాజరైన సబ్జెక్ట్ లింక్ పై క్లిక్ చేస్తే ప్రాథమిక కీ ఓపెన్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కీ కాపీని పొందొచ్చు.
అభ్యంతరాల నమోదు ఎలా..?
- ముందుగా https://tgtet.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని స్పెషల్ టీజీ టెట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ ఓపెన్ అయ్యే కొత్త విండోలోని రైస్ అబ్జెక్షన్స్ అనే లింక్ పై నొక్కాలి.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, Journal Number, పుట్టిన తేదీ, సబ్జెక్ట్ ను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేసిన తర్వాత… మీ అభ్యంతరాలను నమోదు చేయవచ్చు.

E-Paper
