తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ముహూర్తం ఖరారైంది. జులై 6వ తేదీన జిల్లా స్థాయిలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకుల సంస్థ సెక్రటరీ కంభంపాటి శారద ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గురుకుల కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆర్‌జేసీసీఈటీ-2026 ప్రవేశ పరీక్ష ఆధారంగా ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. అయితే రెండు దశల అడ్మిషన్లు ముగిసినప్పటికీ కొన్ని కళాశాలల్లో ఇంకా కొన్ని ఇంటర్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ నేరుగా సీట్లను భర్తీ చేసేందుకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని గురుకుల సొసైటీ నిర్ణయించింది.
ఈ స్పాట్ కౌన్సెలింగ్ ప్రక్రియను జిల్లా స్థాయిలో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను పరిశీలించి, ఆయా జిల్లాల పరిధిలోనే ఈ అడ్మిషన్ల ప్రక్రియ సాగుతుంది. ఆర్‌జేసీసీఈటీ రాసి, ఇప్పటివరకు సీటు రాని విద్యార్థులు లేదా అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు తమ స్వంత జిల్లాల్లో జరిగే ఈ కౌన్సెలింగ్‌కు నేరుగా హాజరుకావచ్చు. అందుబాటులో ఉన్న ఖాళీలను బట్టి అక్కడికక్కడే సీట్లను కేటాయిస్తారు.
కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సిన పత్రాలు
స్పాట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు. తీసుకురావాల్సిన ముఖ్యమైన పత్రాల వివరాలు. స్టడీ సర్టిఫికేట్స్, కులం ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతోపాటుగా ఇతర సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే తీసుకెళ్లాలి.
గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత వసతి సౌకర్యాలు లభిస్తుండటంతో ఈ స్పాట్ కౌన్సెలింగ్‌కు విద్యార్థుల నుంచి భారీ పోటీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆసక్తి గల విద్యార్థులు జూలై 6న నిర్దేశిత సమయానికి అవసరమైన పత్రాలతో కౌన్సెలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని గురుకుల సంస్థ స్పష్టం చేసింది.
{{/usCountry}}గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత వసతి సౌకర్యాలు లభిస్తుండటంతో ఈ స్పాట్ కౌన్సెలింగ్‌కు విద్యార్థుల నుంచి భారీ పోటీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆసక్తి గల విద్యార్థులు జూలై 6న నిర్దేశిత సమయానికి అవసరమైన పత్రాలతో కౌన్సెలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని గురుకుల సంస్థ స్పష్టం చేసింది.
{{/usCountry}}