మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన
తెలంగాణలో మన్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ సన్నాహకాల్లో భాగంగా కమిషన్ జిల్లా, మున్సిపల్ అధికారులతో సమన్వయాన్ని పెంచుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు ఎన్నికల సన్నద్ధతను సమీక్షించడానికి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో తాజాగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా జనవరి 13న టీ-పోల్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. జనవరి 12వ తేదీలోగా తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని కమిషన్ అధికారులను ఆదేశించింది. అలాగే పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను జనవరి 13న టీ-పోల్ మొబైల్ అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేయాలని కూడా సూచించింది. జనవరి 16న పోలింగ్ కేంద్రాల వారీగా ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాలను విడుదల చేయాలని అధికారులకు ఎన్నికల సంఘం తెలిపింది.
బ్యాలెట్ పెట్టెలు, సామగ్రిని సిద్ధంగా ఉంచాలి, కోడ్ కఠినంగా అమలు చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. 2019 ఓటర్ల జాబితానే ప్రాథమిక జాబితాగా పరిగణిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల వివరాలను ధృవీకరించాలని బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ ఓటరు నమోదు మరియు సవరణల కోసం సౌకర్యాలు కల్పించినట్లు కమిషన్ తెలిపింది.
ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
జనవరి 12, 2026 అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణకు చివరి తేదీ గా నిర్ణయించారు. జనవరి 13, 2026 అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిశీలన ప్రారంభం అవుతుంది. జనవరి 16, 2026 తుది ఓటర్ల జాబితా ప్రచురణ చేస్తారు.
రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. గడువు ముగియని 4 మున్సిపాలిటీలతోపాటుగా జీహెచ్ఎంసీని కూడా ప్రస్తుత ఎన్నికల నుంచి మినహాయించారు. పెరిగిన జీహెచ్ఎంసీని మూడుగా విభాగాలుగా చేయాలన్న ప్రతిపాదన కారణంగా వాయిదా వేశారు.
గత ఏడాది డిసెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో, కమిషన్ జిల్లా, మున్సిపల్ అధికారులతో కీలక సంప్రదింపులు జరిపింది. మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


