జ్ఞానాన్ని అందించి, భవిష్యత్తుకు బాటలు వేస్తున్న గురువునే విద్యార్థులు.. తమ చేతులతో కడతేర్చిన దారుణ ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగింది. ఈ ఘటన అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది. నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి (45) హత్య కేసులో పోలీసులు వెలికితీసిన నిజాలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ఆ రాత్రి ఏం జరిగింది?
నల్గొండ ప్రిన్సిపల్ హత్య కేసు
{{^htLoading}} {{/htLoading}}
ప్రాథమిక వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లిలోని జేబీ కాలనీలో నివాసముంటున్న రూపారెడ్డి భర్త ఆగస్టు 11వ తేదీ రాత్రి పనిమీద హైదరాబాద్‌లో ఉన్నారు. ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని విద్యార్థులే ఆమెపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు. పదునైన కత్తితో ఏకంగా 27 సార్లు పొడిచి ఆమెను అక్కడికక్కడే ప్రాణాలు తీశారు. అనంతరం ఇంట్లో ఉన్న దాదాపు రూ.4 లక్షల నగదును దోచుకెళ్లారు.
ఉలిక్కిపడేలా నిజాలు
ఈ హత్య కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దాదాపు 80 మంది అనుమానితులను విచారించారు. చివరకు లభించిన సాంకేతిక ఆధారాలు, సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించగా వెలుగులోకి వచ్చిన నిజాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి.
కొండమల్లేపల్లి మండలంలోని రెండు వేర్వేరు తండాలకు చెందిన ముగ్గురు మైనర్ విద్యార్థులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది.వీరిలో ఇద్దరు మైనర్లు స్వయంగా ఆమె యాజమాన్యంలోని నాగార్జున పబ్లిక్ స్కూల్‌లోనే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు కావడం గమనార్హం.
హత్య చేసిన తర్వాత కూడా ఈ విద్యార్థులు ఏ మాత్రం భయం, పశ్చాత్తాపం లేకుండా మరుసటి రోజు నుంచే రోజూ బడికి వచ్చారు. పాఠశాలలో వాతావరణం ఎలా ఉందో, పోలీసులు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా నడుచుకున్నారు. పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి, ఇబ్రహీంపట్నం సమీపంలో ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.