...
...
Next Story

లక్ష రూపాయలు గెలిచే లక్కీ ఛాన్స్.. జస్ట్ ఒక మంచి పేరు చెప్పండి చాలు

హైదరాబాద్ క్యూర్ ఏరియాలో లక్ష ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. అయితే దీనికి సంబంధించి ఓ కాంటెస్ట్ పెట్టింది. లక్ష ఫ్లాట్ల పథకానికి పేరు సూచించినవారికి.. లక్ష రూపాయల బహుమతి దక్కనుంది.

Published on: Jun 23, 2026, 20:31:08 IST
Advertisement

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా అల్పాదాయ వర్గాలకు (LIG) క్యూర్ ఏరియాలో ప్రతిపాదించిన లక్ష ఫ్లాట్ల నిర్మాణ పథకానికి పేరు ఖరారునకు హౌసింగ్ బోర్డు వినూత్న ప్రయత్నం చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి మంచి పేరును నేరుగా ప్రజల నుంచే స్వీకరించాలని హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. ప్రజల నుంచి వచ్చిన పేర్లలో ఉత్తమమైనదిగా ఎంపికైన పేరును సూచించిన వారికి ఒక లక్ష రూపాయల బహుమతిని అందచేస్తామని, సోషల్ మీడియా వేదికగా ఈ అంశంలో బహిరంగ పోటీని నిర్వహిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

క్యూర్ పరిధిలో పేద వర్గాల ప్రజల కోసం ప్రత్యేకంగా లక్ష ఇండ్లను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎటువంటి వివాదాలు లేకుండా.. అందుబాటులోని ధరల్లో వివిధ వర్గాల ప్రజల సొంత ఇంటి కలలను నెరవేర్చడంలో హౌసింగ్ బోర్డుకు మంచి పేరు ఉంది. అంతే కాకుండా బోర్డు ఆధ్వర్యంలో చేపట్టి ప్రాజెక్టులకు ప్రజల నుంచి ఆదరణ తో పాటు డిమాండ్ కూడా ఉన్నదని ఆయన గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో సుదీర్ఘం కాలం తరువాత చేపడుతున్న ప్రాజెక్టులో ప్రజలను కూడా భాగస్వామ్యులను చేయాలన్న ఆలోచనతో, ప్రజల నుంచి అందే సూచనలతోనే ఈ పథకానికి పేరును కూడా ఖరారు చేయాలని నిర్ణయించినట్లు గౌతం తెలిపారు. ఈ నెల 28 వరకు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోటీని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు సూచించిన పేర్లలో ఉత్తమమైనదిగా ఎంపికైన దానికి లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తామన్నారు.

హౌసింగ్ డిపార్ట్ మెంట్ కు చెందిన tghd.official పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ https://www.instagram.com/p/DZ6mCF_E1PY/ ద్వారా పోటీలో పాల్గొనవచ్చని వివరించారు. క్యూర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్ఐజి ఫ్లాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని, ఇందుకు అవసరమైన భూములను ఇప్పటికే గుర్తించామని వివరించారు. ఇందుకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, లాటరీ పద్ధతిలో ఇండ్లను కేటాయిస్తామని, పూర్తి విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe