Beer Sales : మండే ఎండలు.. మందుబాబులు రోజుకు ఎన్ని లక్షల బీర్లు తాగుతున్నారో తెలుసా?
Beer Sales : ఓ వైపు తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో మందుబాబులు గొంతులోకి చల్లని బీరు పోసేస్తున్నారు. లక్షల సంఖ్యలో బీర్లను తాగేస్తున్నారు.
తెలంగాణలో సూర్యుడు చుక్కలు చూపిస్తు్న్నాడు. ఉదయం 9 దాటితే జనాలపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. పెరుగుతున్న ఎండల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా బీర్ వినియోగం భారీగా పెరిగింది. ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో సగటున రోజుకు దాదాపు 23 లక్షల బాటిళ్ల బీర్లు అమ్ముడయ్యాయి. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 29 మధ్య 55 లక్షలకు పైగా బీర్ కేసులు అమ్ముడయ్యాయి. 2025లో ఇదే కాలంలో అమ్ముడైన 42 లక్షల కేసులతో పోలిస్తే ఇది వార్షిక పెరుగుదలను సూచిస్తుంది.

ప్రతి కేసులో 750 మిల్లీలీటర్ల 12 సీసాలు ఉంటాయి. అంటే ఏప్రిల్ నెలలోని 29 రోజుల్లో 6.6 కోట్ల సీసాలు వినియోగించారు. అనగా రోజుకు సగటున 22.75 లక్షల సీసాలు అమ్ముడయ్యాయి. వేసవి కాలంలో ఎక్సైజ్ రాబడిలో 50 శాతానికి పైగా బీర్ నుంచే వస్తుందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు మద్యం అమ్మకాలు స్వల్పంగా మాత్రమే పెరిగాయి. గత ఏడాది 25 లక్షల కేసులు అమ్ముడవగా.. 2026 ఏప్రిల్‌లో 26 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. బీర్, మద్యం అమ్మకాలు కలిపి ఏప్రిల్‌లో రూ.2,993 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఇది 2025లో రూ.2,773 కోట్లుగా ఉంది.
జనవరి నుంచి ఈ పెరుగుదల ధోరణి స్థిరంగా ఉంటోంది. బీర్ అమ్మకాలు జనవరి 2025లో 31 లక్షల కేసుల నుండి 2026లో 34 లక్షలకు పెరిగాయి. ఫిబ్రవరిలో 28 లక్షల నుండి 38 లక్షలకు ఎగబాకాయి. గతేడాది 30 లక్షల నుండి గణనీయంగా పెరిగి మార్చిలో 50.78 లక్షల కేసులతో ఐదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో పట్టణ కేంద్రాలు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో పెరుగుదల ఎక్కువగా ఉంది.
ధరలు పెరిగినప్పటికీ డిమాండ్ బలంగానే కొనసాగుతోంది. మార్చిలో IMFL అమ్మకాలు 2.5 శాతం తగ్గినప్పటికీ, మొత్తం మద్యం ఆదాయాలు రూ.3,845 కోట్లకు చేరాయని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. ఇందులో మార్చి 31న జరిగిన రికార్డు స్థాయి ఒక్కరోజు అమ్మకాలు రూ.410.87 కోట్లు. జూన్ వరకు వేసవి కొనసాగే అవకాశం ఉన్నందున, బీర్ కంపెనీలు నిరంతర సరఫరాను నిర్ధారించడానికి ఉత్పత్తిని పెంచాయి. ఇక మేలో సూర్యుడి ప్రతాపంతో మరిన్ని బీర్లు అమ్ముడయ్యే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


