...
...
Next Story

పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లొచ్చు.. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు!

42 శాతం బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Published on: Oct 16, 2025, 13:00:09 IST
Advertisement

తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టివేసింది. కావాలంటే పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలను నిర్వహించుకోవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది.

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు
బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు

స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ల అమలును నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది.

ఈ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, విచారణకు స్వీకరించలేమని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేత ప్రభావంతో ప్రభావితం కాకుండా హైకోర్టు మెరిట్‌ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ విక్రమ్ నాథ్ , జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ కావాలి అనుకుంటే పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లొచ్చని సూచించింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ అంశం మీద తక్షణమే జోక్యం చేసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే అభిప్రాయం సరికాదని కోర్టుకు తెలిపారు. ఇందిరా సహానీ కేసులో 50 శాతం పరిమితి దాటొచ్చని, ఉందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన సర్వే జరిగిందన్నారు.

రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో అన్ని పార్టీలూ ఏకాభిప్రాయం చెప్పాయని సింఘ్వీ సుప్రీం కోర్టుకు చెప్పారు. 3 నెలలు దాటినా.. బిల్లు మీద గవర్నర్ నిర్ణయం తీసుకోలేదన్నారు. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోకుంటే బిల్లు ఆమోదం పొందినట్టేనని సుప్రీం చెప్పిందని, ఆ తీర్పు ప్రకారం బిల్లు చట్టంగా మారినట్టేనని బలంగా వాదనలు వినిపించారు. అయితే ఈ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణ చేయడానికి నిరాకరిస్తూ సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks