పదో తరగతి విద్యార్థులకు బిగ్ అప్డేట్.. పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల.. ఇవిగో వివరాలు
తెలంగాణలో పదో తరగతి ఫైనల్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ వివరాలను పంచుకుంది.
తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు షెడ్యూల్ ను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. చెల్లింపులు అక్టోబర్ 30 నుండి ప్రారంభమవుతాయి. నిర్దేశించిన గడువు తర్వాత రూ. 50, రూ. 200, రూ. 500 చొప్పున ఆలస్య రుసుములు వర్తిస్తాయి. షెడ్యూల్ పొడిగింపునకు అనుమతి లేదని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

పదో తరగతి రెగ్యూలర్ విద్యార్థులు, ఇది వరకు ఫెయిల్ అయిన విద్యార్థులకు పదో తరగతి పబ్లిక్ పరీక్షల మార్చి 2026 ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను విడుదలైంది. అక్టోబర్ 30 నుండి చెల్లించవచ్చు. విద్యార్థులు నవంబర్ 13 వరకు ఆలస్య రుసుము లేకుండా సంబంధిత పాఠశాల హెచ్ఎంలకు ఫీజు చెల్లించాలి. రూ. 50 ఆలస్య రుసుముతో నవంబర్ 15, 29 మధ్య చెల్లింపు చేయవచ్చు.
ఇంకా డిసెంబర్ 11 నుంచి 29 వరకు వరుసగా రూ. 200, రూ. 500 ఆలస్య రుసుముతో రుసుము కూడా అంగీకరిస్తారు. ఈ షెడ్యూల్ SSC, OSSC, ఒకేషనల్ పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులకు వర్తిస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టులకు రుసుము రూ.125, మూడు సబ్జెక్టుల వరకు రూ.110. రెగ్యులర్ పరీక్ష రుసుముతో పాటు వృత్తి విద్యా అభ్యర్థులు రూ.60 చెల్లించాలి. పరీక్ష రుసుము చెల్లించడానికి గడువు తేదీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగింపు ఉండదు.
విద్యార్థులు కట్టిన ఫీజును పాఠశాల హెచ్ఎంలు నవంబర్ 14 వరకు ట్రెజరీకి అందించాలి. ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు హెచ్ఎంలకు నవంబర్ 18 వరకు గడువు ఇచ్చారు. ఈ మేరకు డీఈవోలకు డేటా సమర్పించాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


