కొత్త వైన్స్ టెండర్లు 2025 : దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ - ఈనెల 27న లక్కీ డ్రా...!

రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే ఈ గడువు ఇవాళ్టితో(గురువారం) ముగియనుంది. బుధవారం నాటికి దరఖాస్తుల సంఖ్య 90 వేలు దాటినట్లు తెలిసింది.

Published on: Oct 23, 2025, 06:59:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గడువు ఓసారి గడువు కూడా పొడిగించింది. అయితే ఇవాళ్టితో ఆ గడువు కూడా పూర్తి కానుంది. చివరి రోజు కావటంతో… ఇవాళ కూడా కాస్త అధిక సంఖ్య అప్లికేషన్లు రావొచ్చని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో వైన్స్ టెండర్లు
తెలంగాణలో వైన్స్ టెండర్లు

కొత్త వైన్స్ టెండర్ల కోసం సెప్టెంబర్ 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. అయితే అనుకున్నంతగా స్పందన లేకపోవటంతో… ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతూ వచ్చింది. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా…. బుధవారం(అక్టోబర్ 22) 90 వేలు దాటాయి.

ఇక గత ఏడాది మద్యం దుకాణాల కోసం ఏకంగా 1.31 లక్షల దరఖాస్తులు రాగా… ఈసారి అనుకున్నంత స్థాయిలో మాత్రం స్పందన కనిపించలేదు.దరఖాస్తు ఫీజు(రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు) పెంపు నిర్ణయం దరఖాస్తులపై పడినట్లు కనిపిస్తోంది.

దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత…. అక్టోబర్‌ 27న కొత్త మద్యం షాపుల కేటాయింపునకు డ్రా తీస్తారు. డ్రా లో దుకాణాల లైసెన్స్ పొందిన వారు మొదటి విడత చెల్లింపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు మొత్తాన్ని 6 విడతలుగా చెల్లించుకోవచ్చు.

కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితి ఉంటుంది. డ్రా పద్ధతిలో ఎంపికైన వారు… డిసెంబర్ 1వ తేదీ నుంచి దుకాణాలను ఓపెన్ చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టీలు, గీత కార్మికులకు కేటాయించే దుకాణాలను జిల్లా కలెక్టర్లు గత నెల 25వ తేదీనే డ్రా పద్దతిలో ఎంపిక చేశారు. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలల్లో గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను కేటాయించిన సంగతి తెలిసిందే.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More