తెలంగాణ వైన్స్ టెండర్లు 2025 : దరఖాస్తుల గడువు పొడిగింపు - 'డ్రా' ఏ రోజు తీస్తారంటే..?
వైన్స్ షాప్ టెండర్లకు చివర్లో దరఖాస్తులు పెరుగుతున్నాయి. అక్టోబర్ 18వ తేదీతో గడువు ముగియగా… అధికారులు మరో నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించారు.
రాష్ట్రంలో కొత్త వైన్స్ షాపుల కేటాయింపులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు శనివారమే ముగియగా… అధికారులు కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎక్సైజ్‌శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈనెల 27వ తేదీన డ్రా
బీసీ బంద్‌తో పాటు బ్యాంకుల బంద్‌లతో దరఖాస్తు చేసుకోలేకపోయినట్లు పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు గడువును పొడిగించారు. మరోవైపు ముందుగా ప్రకటించిన విధంగా అక్టోబర్ 23వ తేదీన జరగాల్సిన డ్రా ప్రక్రియ వాయిదా పడింది. ఈనెల27వ తేదీన జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా తీసి షాపులను కేటాయిస్తారు.
కొత్త వైన్స్ టెండర్ల కోసం సెప్టెంబర్ 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. అయితే అనుకున్నంతగా స్పందన లేకపోవటంతో… ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతూ వచ్చింది. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా…. శనివారం నాటికి 90 వేల లోపు దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. శుక్ర, శనివారాల్లో అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి.
గడువు పొడిగించటంతో మరికొన్ని దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక గత ఏడాది మద్యం దుకాణాల కోసం ఏకంగా 1.31 లక్షల దరఖాస్తులు రాగా… ఈసారి అనుకున్నంత స్థాయిలో మాత్రం స్పందన కనిపించలేదు.దరఖాస్తు ఫీజు(రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు) పెంపు నిర్ణయం దరఖాస్తులపై పడినట్లు కనిపిస్తోంది.
దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత…. అక్టోబర్ 27న కొత్త మద్యం షాపుల కేటాయింపునకు డ్రా తీస్తారు. డ్రా లో దుకాణాల లైసెన్స్ పొందిన వారు మొదటి విడత చెల్లింపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు మొత్తాన్ని 6 విడతలుగా చెల్లించుకోవచ్చు.
కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితి ఉంటుంది. డ్రా పద్ధతిలో ఎంపికైన వారు… డిసెంబర్ 1వ తేదీ నుంచి దుకాణాలను ఓపెన్ చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

