Telangana BC caste name changes : రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల అభ్యర్థనలు, వారి సామాజిక గౌరవాన్ని పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సమర్పించిన సిఫార్సుల మేరకు రాష్ట్ర కేబినెట్ పలు కులాల పేర్లలో మార్పులు చేసేందుకు, అలాగే మరికొన్ని కులాలకు పర్యాయపదాలను జోడించేందుకు ఆమోద ముద్ర వేసింది. ప్రధానంగా గ్రూప్-ఏ, గ్రూప్-డి విభాగాల్లోని పలు వరుస సంఖ్యల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.

సామాజికంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన సుదీర్ఘ కాలపు విన్నపాలను పరిశీలించిన అనంతరం…. వారి మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఈ మేరకు బీసీ జాబితాలో చేసిన మార్పుల వివరాలను రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
గ్రూప్-ఏ విభాగంలో మార్పులు:
- గడ వంశీయ: గ్రూప్-ఏ లోని వరుస సంఖ్య 7లో ఇప్పటివరకు ఉన్న "దొమ్మర" అనే పదాన్ని తొలగించి….. దాని స్థానంలో "గడ వంశీయ" అనే పేరును ప్రభుత్వం ఖరారు చేసింది.
- వంశ రాజ్: గ్రూప్-ఏ లోని వరుస సంఖ్య 18లో ఉన్న "పిచ్చకుంట్ల" అనే పదాన్ని మార్చారు. ఇకపై దీన్ని "వంశ రాజ్" గా వ్యవహరిస్తారు.
- బుడబుక్కల (శివ క్షత్రియ): వరుస సంఖ్య 4లో ఉన్న కులానికి "శివ క్షత్రియ" అనే పదాన్ని పర్యాయపదంగా చేర్చారు. దీంతో ఈ కులం పేరు ఇకపై "బుడబుక్కల, శివ క్షత్రియ"గా రికార్డుల్లో నమోదు కానుంది.
- రజక, చాకలి, ధోబీ: వరుస సంఖ్య 5లో ఉన్న "వన్నార్" అనే పదాన్ని తొలగించారు. ఆ స్థానంలో "ధోబీ" అనే పదాన్ని చేర్చి, మొత్తంగా "రజక, చాకలి, ధోబీ"గా పేర్కొంటారు.
- వీరభద్రియ: వరుస సంఖ్య 23లో ఉన్న వీరభద్రియ కులానికి సంబంధించి, వారి అభ్యర్థన మేరకు "వీరముష్టి, నెట్టి కోటల" అనే పదాలను పర్యాయపదాలుగా కలిపారు.
గ్రూప్-డి విభాగంలో మార్పులు :
- తమ్మలి (బ్రాహ్మణేతర): గ్రూప్-డి లోని వరుస సంఖ్య 29లో ఉన్న "శూద్ర కులం" అనే పదాన్ని ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. దాని స్థానంలో "తమ్మలి (బ్రాహ్మణేతర)"గా పేరు మార్చారు.
- మేర, మేరు, చిప్పోలు: వరుస సంఖ్య 5లో ఉన్న కులానికి "మేరు" అనే పదాన్ని పర్యాయపదంగా చేర్చారు. దీనివల్ల ఇకపై "మేర, మేరు, చిప్పోలు" అనే పేర్లతో ఈ వర్గాన్ని గుర్తిస్తారు.
ఈ మార్పుల వల్ల ఆయా కులాలకు చెందిన ప్రజలు విద్యా, ఉద్యోగ, సంక్షేమ పథకాల్లో తమ సామాజిక గుర్తింపును మరింత గౌరవప్రదంగా పొందే అవకాశం ఉంటుందని బీసీ కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. కేబినెట్ నిర్ణయంతో ఈ కొత్త పేర్లు వెంటనే అధికారిక రికార్డుల్లో అమల్లోకి రానున్నాయి.
{{/usCountry}}ఈ మార్పుల వల్ల ఆయా కులాలకు చెందిన ప్రజలు విద్యా, ఉద్యోగ, సంక్షేమ పథకాల్లో తమ సామాజిక గుర్తింపును మరింత గౌరవప్రదంగా పొందే అవకాశం ఉంటుందని బీసీ కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. కేబినెట్ నిర్ణయంతో ఈ కొత్త పేర్లు వెంటనే అధికారిక రికార్డుల్లో అమల్లోకి రానున్నాయి.
{{/usCountry}}