ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ - స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్..! అజెండాలో కీలకాంశాలు
ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. స్థానిక ఎన్నికలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇవ్వటంతో ప్రక్రియ ఆగిపోయింది. దీంతో ఎన్నికల నిర్వహణపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై మంత్రివర్గం చర్చించనుంది.
ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇవ్వటంతో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ విషయంలో ఓ నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ అవుతుంది. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంతో పాటు బీసీ రిజర్వేషన్లపై తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించనుంది. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటానేది ఆసక్తికరంగా మారింది.
అజెండాలో కీలకాంశాలు…!
ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం పలు మార్గాలను ఎంచుకుంది. కానీ 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దన్న పరిమితులు ఉండటంతో… బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశానికి బ్రేకులు పడినట్లు అయింది. ప్రభుత్వపరంగా కుదురకపోవటంతో… పార్టీ పరంగా 42 శాతం సీట్లు కేటాయించే అంశాన్ని అధికార కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు సమాచారం..!
ఇక ఇటీవలే జరిగిన కేబినెట్ భేటీలో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం కూడా సతకం అయింది. ఇందుకు సంబంధించిన ఆమోదించి… ఆర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశం ఉంది. దీనిపై ఇవాళ కేబినెట్ నిర్ణయం ఉండనుంది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు డిజైన్ల రూపకల్పన కోసం ఇటీవల నీటిపారుదల శాఖ ఆహ్వానించింది.ఆసక్తి వ్యక్తం చేసిన టెండర్లకు సైతం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనులపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా నీటిపారుదల శాఖకు సంబంధించి మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

