స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలంగాణ సర్కార్ శుభవార్త - ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలుంటే పోటీకి ఉన్న అనర్హత నిబంధన ఎత్తివేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి పొంగులేటి వెల్లడించారు.

Published on: Oct 16, 2025, 21:14:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలుంటే పోటీకి ఉన్న అనర్హత నిబంధనను ఎత్తివేయనున్నారు. ఈ మేరకు కేబినెట్ గురువారం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలునా పోటీ చేయవచ్చు. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న వారికి శుభవార్త చెప్పినట్లు అయింది.

తెలంగాణ సర్కార్ శుభవార్త
తెలంగాణ సర్కార్ శుభవార్త

కేబినెట్ ముఖ్యమైన నిర్ణయాలు:

  • 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం.
  • మద్దతు ధర, బోనస్ 500 ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
  • రాష్ట్రంలో హుజూర్ నగర్‌, కొడంగల్, నిజామాబాద్‌లో అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
  • హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2A, 2B పొడిగింపుపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం.
  • నల్సార్‌లో స్థానిక విద్యార్థులకు 50 శాతం సీట్లు ఇవ్వాలని తీర్మానం.
  • ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల పూర్తి చేసుకుంటున్న సందర్భంలో డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు జరపాలని కేబినెట్ నిర్ణయం
  • భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్‌కు 10 ఎక‌రాలు కేటాయించింది.
  • నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి ఇప్పుడున్న చోటనే అదనంగా 7 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీర్మానం.
  • హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి మెట్రో 2A, 2B విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడ్‌లో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. అందుకు సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు. అధికారుల కమిటీ అందించే నివేదికను మంత్రివర్గ ఉప సంఘం సమగ్రంగా అధ్యయం చేస్తుంది.
  • రాష్ట్రంలో హ్యామ్ మోడ్‌లో మొద‌టి ద‌శ‌లో 5,566 కిలోమీట‌ర్ల రోడ్ల నిర్మాణానికి ఆమోదం.
  • ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి శామీర్‌పేట ఓఆర్ఆర్, ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వ‌ర‌కు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి ర‌క్ష‌ణ శాఖ భూములకు ప్ర‌త్యామ్నాయంగా ఆ శాఖకు 435.08 ఎక‌రాల భూముల‌ను అప్ప‌గిస్తూ తీర్మానం.
  • కృష్ణా - వికారాబాద్ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హైక్టార్ల భూ సేక‌ర‌ణ‌కు అయ్యే రూ.438 కోట్ల వ్య‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించేందుకు అంగీకారం.
  • మ‌న్న‌నూర్‌ - శ్రీ‌శైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించాలని నిర్ణయం.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More