New Pension Status Live : తెలంగాణ చేయూత కొత్త పెన్షన్‌ స్టేటస్ Live అని చూపిస్తుందా? లేదా?

Telangana New Pension Status Live : తెలంగాణలో కొంతమంది కొత్త పెన్షన్లపై గందరగోళంలో ఉన్నారు. తమకు పెన్షన్ వచ్చిందా? లేదా? అని ఇబ్బందిపడుతున్నారు. కింద ఇచ్చే లింక్ క్లిక్ చేసి మీరు క్లారిటీ తెచ్చుకోవచ్చు.

Updated on: Nov 16, 2026, 18:10:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణలో పెన్షన్ల జాతర నడుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. కొత్త పెన్షన్‌ మంజూరైనవారికి మంజూరు పత్రాలను అందిస్తున్నారు. ప్రొసిడింగ్స్ కంప్లీట్ చేస్తున్నారు. చాలామందికి పెన్షన్లపై గందరగోళం నెలకొంది. అలాంటివారు ఈజీగా తమ పెన్షన్ స్టేటస్ చూసుకోవచ్చు. చేయూత కొత్త పింఛన్లు మీకు మంజూరైందా లేదా చూసుకోవచ్చు.

తెలంగాణ కొత్త పెన్షన్లు
తెలంగాణ కొత్త పెన్షన్లు

రాష్ట్రంలో కొత్తగా 4,63,857 మంది అర్హులకు పింఛన్లను మంజూరయ్యాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న కొత్త లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా మొదటి నెల పింఛన్ సొమ్మును జమ చేసేందుకు సెర్ప్ రెడీ అయింది.

అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఇస్తున్నారు. నవంబర్ 18 నాటికి పంపిణీ పూర్తి చేస్తారు. నవంబర్ 19న నగదు బదిలీకి ఆటంకాలు కలగకుండా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

కొత్త పింఛన్లు 4,63,857లో వితంతువులు-2,77,894, దివ్యాంగులు-1,00,224, ఒంటరి మహిళలు - 53,844, గీత కార్మికులు-27,444, చేనేత కార్మికులు - 4,451 మందికి పెన్షన్లు మంజూరు చేశారు. చాలా మంది తమకు పెన్షన్ వచ్చిందా లేదా అనే ఆందోళనలో ఉన్నారు.

తెలంగాణ చేయూత పెన్షన్ పోర్టల్‌లో మీ స్టేటస్ Live అని చూపిస్తే, మీ పెన్షన్ ప్రస్తుతం యాక్టివ్‌గా ఉందని అర్థం. మీ పెన్షన్ దరఖాస్తు పూర్తిగా ఆమోదించారు. ప్రభుత్వ రికార్డులలో మీ పేరు లబ్ధిదారుల జాబితాలో కొనసాగుతోంది. మీ పెన్షన్‌పై ఎలాంటి నిలిపివేత (Hold) లేదా రద్దు లేదని దీని అర్థం.

ఒకవేళ స్టేటస్ Live అని ఉన్నప్పటికీ డబ్బులు జమ కాకపోతే మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ సీడింగ్, e-KYC పూర్తయ్యాయో లేదో బ్యాంకులో సరిచూసుకోండి. మీ గ్రామపంచాయతీ కార్యదర్శిని లేదా మున్సిపల్/ఎంపీడీవో కార్యాలయంలోని పెన్షన్ విభాగం అధికారులను సంప్రదించి చెల్లింపుల వివరాలు చూడండి. చేయూత పెన్షన్ పోర్టల్‌లో Live అని చూపిస్తే దాదాపు మీ పెన్షన్ డబ్బులు పడిపోతాయి.

పెన్షన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

www.cheyutha.telangana.gov.in వెబ్‌సైట్ వెళ్లండి.

Enter Pension ID / AADHAR ID దగ్గరలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.

తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయాలి.

పెన్షనర్ బేసిక్ డీటెయిల్స్ అని మీ వివరాలు అన్ని కనిపిస్తాయి.

అందులో పెన్షన్ స్టేటస్ Live అని కనిపిస్తుంది.

ఈ లింక్ క్లిక్ చేసి నేరుగా మీ పెన్షన్ స్టేటస్ చెక్ చేసుకోండి.

పెన్షన్ స్టేటస్ లైవ్ అని ఉంటే మీకు పెన్షన్ మంజూరైనట్టే. అంతేకాదు మీ పెన్షన్ అమౌంట్ కూడా అందులో కనిపిస్తుంది. పింఛను ఐడీ కూడా ఉంటుంది. నవంబర్ 19 నుంచి మీ బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్ వచ్చేస్తుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More