TG Cheyutha Pension Scheme : చేయూత కొత్త పింఛన్ల ప్రక్రియ వేగవంతం - సెప్టెంబరు 1 నుంచి వెరిఫికేషన్..! ప్రాసెస్ ఇలా

Telangana Cheyutha Pension Scheme : రాష్ట్రంలో చేయూత పథకం కొత్త లబ్ధిదారుల ఎంపిక వేగవంతమైంది. ఈ నెలాఖరుతో దరఖాస్తుల గడువు ముగుస్తుండటంతో…. సెప్టెంబరు 1 నుంచి గ్రామాలు, పట్టణాల్లో క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభమవుతుంది.

Published on: Aug 26, 2026, 09:42:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Cheyutha Pension Scheme : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'చేయూత' పింఛను పథకం కింద కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా వచ్చే నెల సెప్టెంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించబోతున్నట్లు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రాపర్టీ (SERP - సెర్ప్) స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల యంత్రాంగానికి, అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

చేయూత కొత్త పింఛన్ల అప్డేట్
చేయూత కొత్త పింఛన్ల అప్డేట్

ఈనెలాఖరు వరకే గడువు…

కొత్త పింఛన్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 9వ తేదీన ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు అందుబాటులో ఉంది. ఇప్పటివరకు నమోదు అయిన సమాచారం ప్రకారం…. మంగళవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 3,03,066 మంది అర్హులైన పేదలు పింఛన్ కోసం అర్జీలు సమర్పించారు. దరఖాస్తు గడువు ముగిసేందుకు ఇంకా ఆరు రోజుల సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో… మరో 2 లక్షలకు పైగా నూతన దరఖాస్తులు వస్తాయని సెర్ప్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 2.5 లక్షల మందికి పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ లక్ష్యానికి అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ సాయం అందేలా ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన తండాలు, గూడేలు, మారుమూల ఎస్సీ కాలనీలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని పేద మురికివాడల దరఖాస్తుదారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్దేశించింది.

సెప్టెంబర్ 1 నుంచి వెరిఫికేషన్…

సెప్టెంబరు 1 నుంచి ప్రారంభమయ్యే క్షేత్రస్థాయి విచారణలో గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఎంపిక విధానం వేగవంతంగా, సమర్థవంతంగా సాగేందుకు స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాల సహకారాన్ని కూడా తీసుకోనున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు సేకరించిన నివేదికలను ముందుగా మండల, పట్టణ స్థాయి అధికారులకు పంపుతారు. అక్కడ ప్రాథమిక పరిశీలన పూర్తయ్యాక…. ఆ నివేదికలు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలోకి వెళ్తాయి.

అక్కడి నుంచి అంతిమ ఆమోదం కోసం సెర్ప్ ప్రధాన కార్యాలయానికి నివేదికలు చేరుకుంటాయి. సెర్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, కొత్త పింఛనుదారుల తుది జాబితాను అధికారికంగా ఖరారు చేస్తారు.

దరఖాస్తు విధానం ఎలా….?

చేయూత వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకొన్న అనంతరం వాటిని నింపి, అవసరమైన ధ్రువపత్రాలతో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో బిల్‌ కలెక్టర్లకు సమర్పించాల్సి ఉంటుంది.

కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు పోర్టల్ ( ( https://cheyutha.telangana.gov.in ) నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నింపిన అప్లికేషన్‌ను మీసేవా కేంద్రాలు, ఎంపీడీవో కార్యాలయాలు, మండల సమాఖ్యలు, మున్సిపల్ ఆఫీసులు లేదా వార్డు కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో సమర్పించే సౌకర్యం కల్పించారు.

తప్పనిసరిగా సమర్పించాల్సిన పత్రాలు….

  • పూర్తి చేసిన నూతన దరఖాస్తు ఫారం (తప్పనిసరి)
  • ఆధార్ కార్డు (తప్పనిసరి)
  • వయో నిర్ధారణ పత్రం - జనన ధృవీకరణ / పాఠశాల ధృవీకరణ / ఓటర్ కార్డు (తప్పనిసరి)
  • రేషన్ కార్డు లేదా రెవెన్యూ శాఖ వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం (తప్పనిసరి)
  • బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ - దివ్యాంగ మైనర్ పిల్లల విషయంలో జాయింట్ ఖాతా (తప్పనిసరి)
  • భర్త మరణ ధృవీకరణ పత్రం మరియు భర్త ఆధార్ కార్డు (వితంతు పింఛన్ దరఖాస్తుదారులకు)
  • విడాకులు/విడిపోయిన పత్రం లేదా తహసీల్దార్ విచారణ నివేదిక (ఒంటరి మహిళ పింఛన్ దరఖాస్తుదారులకు)
  • చేనేత అండ్ జౌళి శాఖ ధృవీకరణ పత్రం (చేనేత కార్మికుల విషయంలో)
  • ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రం (కల్లు గీత కార్మికుల విషయంలో)
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More