తెలంగాణలోని ఆర్థిక భరోసా కల్పించే చేయూత సామాజిక భద్రత పింఛన్ల పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,63,857 మంది అర్హులకు పింఛన్లను మంజూరు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న కొత్త లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా మొదటి నెల పింఛన్ సొమ్మును జమ చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) రెడీ అయింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కొత్త పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తున్నారు. ఈ పంపిణీ ప్రక్రియను నవంబర్ 18 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు నవంబర్ 19న నగదు బదిలీకి ఆటంకాలు కలగకుండా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
కొత్తగా మంజూరైన మొత్తం 4,63,857 పింఛన్లలో వితంతువులు, దివ్యాంగులకు అత్యధిక ప్రాధాన్యత లభించింది. కేటగిరీల వారీగా లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి. వితంతువులు-2,77,894, దివ్యాంగులు-1,00,224, ఒంటరి మహిళలు - 53,844, గీత కార్మికులు-27,444, చేనేత కార్మికులు - 4,451, మొత్తం లబ్ధిదారులు 4,63,857గా ఉన్నారు.
ప్రభుత్వం డీబీటీ విధానంలో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే పింఛన్ డబ్బులను జమ చేయనున్నందున, కొత్త లబ్ధిదారులు అన్నింటినీ సరిచూసుకోవడం తప్పనిసరి. మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ అయి ఉండటంతో పాటు, ఎన్పీసీఐ మ్యాపింగ్ యాక్టివ్‌గా ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి. చాలా కాలంగా లావాదేవీలు జరపని బ్యాంకు ఖాతాలు ఉంటే, వెంటనే సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ పూర్తి చేసి ఖాతాను యాక్టివేట్ చేసుకోవాలి.
మంజూరు పత్రం అందినప్పటికీ నవంబర్ 19న నగదు జమ కావడంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే, సమీపంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం(MPDO), మున్సిపల్ కార్యాలయంలో అధికారులను సంప్రదించి వివరాలు సరిచేసుకోవచ్చు.
స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా
{{/usCountry}}మంజూరు పత్రం అందినప్పటికీ నవంబర్ 19న నగదు జమ కావడంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే, సమీపంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం(MPDO), మున్సిపల్ కార్యాలయంలో అధికారులను సంప్రదించి వివరాలు సరిచేసుకోవచ్చు.
స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా
{{/usCountry}}మెున్నటిదాకా తెలంగాణ చేయూత పెన్షన్ల స్టేటస్ చూస్తే.. Applied For Pension అని చూపించింది. అయితే ప్రస్తుతం మాత్రం పెన్షన్ స్టేటస్‌లో మార్పు కనిపించింది. Withheld అని చూపిస్తోంది. అయితే దీని అర్థం పెన్షన్ నిలిపి ఉందని అర్థం. స్టేటస్‌లో పెన్షన్ అమౌంట్ చూపిస్తుంది. అంతేకాదు లాస్ట్ సాంక్షన్ డేట్ అండ్ అమౌంట్‌లో సెప్టెంబర్ 2026 అని చూపిస్తుంది. పెన్షన్ ఐడీ కూడా క్రియేట్ అయింది. ఇది జిల్లా కోడ్ ముందుగా వచ్చేలా ఉంటుంది. ఉదాహరణకు పెద్దపల్లి జిల్లా అయితే PDPAB అని, నల్గొండ జిల్లా అయితే NLGAB అని పెన్షన్ స్టేటస్‌లో కనిపిస్తుంది.
నవంబర్ 19వ తేదీన పంపిణీ చేసిన తర్వాత పెన్షన్ స్టేటస్ మారవచ్చు. disbursal అని లేదంటే.. పింఛన్ పంపిణీ చేశారు అనే అర్థంలోకి స్టేటస్ మారే అవకాశం ఉంది. ప్రస్తుతం Withheld పెన్షన్ స్టేటస్ అనేది మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ సరిగ్గా లింక్ కాకపోయినా లేదా NPCI మ్యాపింగ్ యాక్టివ్‌గా లేకపోయినా అలా చూపించవచ్చు. లబ్ధిదారుల అర్హతలపై ప్రభుత్వం నిర్వహించే తనిఖీల్లో మీ వివరాలు (ఆదాయం, భూమి వివరాలు, లేదా కుటుంబ సభ్యుల ఉద్యోగాల సమాచారం) మళ్లీ పరిశీలనలో ఉండి ఉండవచ్చు. లబ్ధిదారుల ధృవీకరణ (KYC/Biometric) పూర్తి కాకపోవడం కూడా ఓ కారణం కావొచ్చు.
ఒకవేళ నవంబర్ 19వ తేదీ తర్వాత కూడా Withheld అని పెన్షన్ స్టేటస్ చూపిస్తే.. గ్రామ పంచాయతీ సెక్రటరీని లేదా మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం(MPDO Office) లోని సెర్ప్ అధికారులను కలవండి. పట్టణ ప్రాంతాల వారైతే మున్సిపల్ కార్యాలయంలోని అధికారులను సంప్రదించాలి. వారి లాగిన్ నుంచి మీ పెన్షన్ ఐడీని ఎంటర్ చేస్తే.. కచ్చితంగా ఏ కారణం వల్ల Withheldలో పెట్టారో అర్థమైపోతుంది.
ఈ లింక్ క్లిక్ చేసి మీ పెన్షన్ స్టేటస్ చూసుకోండి.