...
...
Next Story

తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు - ముంపు పరిహారానికి సిద్ధం - సీఎం రేవంత్ రెడ్డి

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం, ముంపు సమస్యలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. అధికారులతో జరిపిన సమీక్షలో పలు కీలక సూచనలు చేశారు.

Published on: Nov 4, 2026, 06:03:15 IST
Advertisement

మహారాష్ట్రతో ముడిపడి ఉన్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ అంశంపై నిరంతరం సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పనులు ముందుకు తీసుకెళ్లాలన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు, అక్కడ తలెత్తిన ప్రధాన అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

ముంపు పరిహారానికి నిధులు సిద్ధం….

మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో బ్యారేజీ కారణంగా ఎదురయ్యే ముంపు సమస్యపై పూర్తిస్థాయి వివరాలు, సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

"మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకోసం అవసరమైన నిధులను రెండు రాష్ట్రాల జాయింట్ అకౌంట్‌లో జమ చేయడానికి కూడా మేం సిద్ధమే" అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.

అంతేకాకుండా, సరిహద్దు భూముల ముంపునకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఎలాంటి సర్వేలకైనా తమకు అభ్యంతరం లేదని తెలిపారు. మహారాష్ట్ర అధికారులకు అవసరమైన సాంకేతిక సమాచారం, భూముల వివరాలను ఎప్పటికప్పుడు వేగంగా అందించాలని సూచించారు.

గతంలో రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాలు, ఇతర రికార్డులు మరియు చట్టపరమైన పత్రాలను వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య సజావుగా చర్చలు జరిపి, వివాదాలు లేకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సమీక్షలో స్పష్టం చేశారు.

ఈ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌తో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, సాగునీటి శాఖ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks