...
...
Next Story

ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన ఎమ్మెల్యే అనిరుధ్ వ్యాఖ్యలు

తెలంగాణలో ప్రభుత్వ అధికారుల అవినీతి వల్ల కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని జడ్చర్ల ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారాయి. లంచం ఇస్తేనే పనులు జరుగుతున్నాయని, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రోజుకు లక్షల్లో వసూళ్లు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు.

Published on: Nov 18, 2026, 07:00:05 IST
Advertisement

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ అధికారుల అవినీతి వల్ల అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కింది స్థాయి వ్యవస్థలో పాతుకుపోయిన అధికారుల అవినీతిని జర్నలిస్టులే బయటపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ సమీపంలోని జడ్చర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అనిరుధ్ రెడ్డి, జర్నలిస్టుల కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతిని ఎత్తిచూపుతున్నాయని ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.

కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న తరుణంలో, సొంత పార్టీ ఎమ్మెల్యేనే అధికారుల పనితీరుపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో పనులు జరగకపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రూ.15 వేలు లంచం ఇస్తేనే పని జరిగింది

ప్రజాప్రతినిధులు ప్రజలకు మంచి చేయాలని భావిస్తున్నా, కింది స్థాయి యంత్రాంగం సహకరించడం లేదని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. "జర్నలిస్టులు, రాజకీయ నాయకులు అవినీతిపరులు కాదు. అధికారులే అవినీతికి పాల్పడుతున్నారు. మేం ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాం కానీ, క్షేత్రస్థాయిలో వ్యవస్థ బాగోలేదు. ఇందుకు జడ్చర్లనే ఒక ఉదాహరణగా చెబుతున్నా. నేను స్వయంగా ఒక పని చేయాలని అధికారులను ఆదేశించా. అయినా ఆ పని జరగలేదు. చివరకు కార్యాలయంలో రూ.15 వేలు లంచం ఇచ్చాక గానీ ఆ పని పూర్తి కాలేదు. ఇలాంటి విషయాలను జర్నలిస్టులు మాత్రమే వెలుగులోకి తీసుకురాగలరు" అని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.

రోడ్లు వేయాలన్నా కమీషన్లు అడుగుతున్నారు

అవినీతి అధికారుల ఆగడాలను మీడియా ప్రతినిధులు బయటపెడితే, బాధ్యులపై కచ్చితంగా శిక్ష పడేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అభివృద్ధి పనుల్లోనూ కమీషన్ల దందా నడుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "రోడ్లు వేయాలన్నా మా కమీషన్ ఎంత అని అధికారులు అడుగుతున్నారు. దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? మా ప్రభుత్వానికే కదా చెడ్డపేరు వచ్చేది" అని ఆయన ప్రశ్నించారు.

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రోజుకు లక్షల్లో దందా

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks