పోలీసులపై రియాజ్‌ కాల్పులు జరపబోయాడు - డీజీపీ శివధర్ రెడ్డి

రియాజ్ ఎన్ కౌంటర్ పై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ఆస్పత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కునేందుకు రియాజ్ ప్రయత్నించారని చెప్పారు. ఈ క్రమంలోనే ఎన్ కౌంటర్ జరిగిందన్నారు.

Published on: Oct 20, 2025, 14:54:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిజామాబాద్‌లో పోలీసుల కాల్పుల్లో నిందితుడు రియాజ్‌ మృతి చెందిన ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి స్పందించారు. రియాజ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడని చెప్పారు. ఆస్పత్రిలో రూమ్‌ బయట ఉన్న ఏఆర్ పోలీసుల గన్‌ లాక్కునే ప్రయత్నం చేశాడని…. రియాజ్‌ గన్‌ ఫైర్‌ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలోనే పోలీసులు కాల్పులు జరిపారని డీజీపీ వివరించారు.

తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి
తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి

కాల్పులపై డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటన

నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నేరస్థుడైన రియాజ్ మరోసారి పోలీసుల మీద దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. రియాజ్ ను పట్టుకొనేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేయగా, పోలీసుల దగ్గరున్న ఆయుధాన్ని లాక్కొని పోలీసుల మీద కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. నిన్న రియాజ్ ను పట్టుకొనేందుకు ఆసిఫ్ అనే పౌరుడు పోలీసులకు సహకరిస్తున్న క్రమంలో అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆసిఫ్ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈరోజు పోలీసుల నుండి తుపాకీ లాక్కొని పోలీసులపై కాల్పులు జరిపే ప్రయత్నం చేసి, పారిపోయేందుకు ప్రయత్నించాడు. రియాజ్ ను నివారించడానికి పోలీసులు జరిపిన ప్రయత్నంలో అతను చనిపోయాడు” అని డీజీపీ మహేందర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రమోద్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్ గ్రేషియా - డీజీపీ

తెలంగాణలో లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడేందుకు పోలీసుశాఖ నిబద్ధతతో ఉందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి నేరస్తులను అయినా అణచివేస్తామన్నారు. కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. ప్రమోద్‌ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 300 గజాల ఇంటి స్థలం ఇస్తామని వెల్లడించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More