రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ (నేరుగా రెండో సంవత్సరం) ప్రవేశాల కోసం నిర్వహించిన 'తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్' (TG ECET) 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఆదేశాల ప్రకారం ప్రవేశ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన జేఎన్‌టీయూ హైదరాబాద్ (JNTUH) అధికారులు ఈ ఫలితాలను…. అభ్యర్థుల ర్యాంక్ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులతో పాటు బీఎస్సీ (గణితం) చదివిన వేలాది మంది అభ్యర్థులు ఈ ఏడాది ఈసెట్ పరీక్షకు హాజరయ్యారు. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీ (Preliminary Key) పై అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. అభ్యంతరాలన్నింటినీ నిపుణుల కమిటీ పరిశీలించిన అనంతరం.... అభ్యర్థుల మార్కులు, సాధించిన స్టేట్ వైడ్ ర్యాంకులను ఇవాళ ప్రకటించారు.
టీజీ ఈసెట్ 2026 - ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ ఇలా :
- మొదటగా టీజీ ఈసెట్ అధికారిక వెబ్‌సైట్ ecet.tsche.ac.in ను సందర్శించాలి.
- హోం పేజీలో కనిపించే 'Download Rank Card'' లింక్‌పై క్లిక్ చేయాలి.
- ఓపెన్ అయిన కొత్త విండోలో అభ్యర్థి తన ఈసెట్ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number), రిజిస్ట్రేషన్ నంబర్ , పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయాలి.
- వివరాలన్నీ సరిచూసుకుని 'View Rank Card' పై క్లిక్ చేయగానే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కోసం ఈ ర్యాంక్ కార్డును ప్రింట్‌అవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
టీజీ ఈసెట్ - 2026 ఫలితాల విడుదలైన నేపథ్యంలో ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదలవుతుంది.అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో బీఈ/బీటెక్, బీఫార్మసీ కోర్సుల ద్వితీయ సంవత్సరంలో సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ (ధృవపత్రాల పరిశీలన), వెబ్ ఆప్షన్ల నమోదు తేదీల వివరాలను ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు.
{{/usCountry}}టీజీ ఈసెట్ - 2026 ఫలితాల విడుదలైన నేపథ్యంలో ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదలవుతుంది.అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో బీఈ/బీటెక్, బీఫార్మసీ కోర్సుల ద్వితీయ సంవత్సరంలో సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ (ధృవపత్రాల పరిశీలన), వెబ్ ఆప్షన్ల నమోదు తేదీల వివరాలను ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు.
{{/usCountry}}