TG ECET 2026 Results : తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల - ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TG ECET 2026 Results : తెలంగాణ ఈసెట్ (TG ECET) 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ తో అధికారిక వెబ్‌సైట్ (ecet.tgche.ac.in/)లో ర్యాంక్ కార్డను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published on: May 29, 2026, 16:16:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ (నేరుగా రెండో సంవత్సరం) ప్రవేశాల కోసం నిర్వహించిన 'తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్' (TG ECET) 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఆదేశాల ప్రకారం ప్రవేశ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన జేఎన్‌టీయూ హైదరాబాద్ (JNTUH) అధికారులు ఈ ఫలితాలను…. అభ్యర్థుల ర్యాంక్ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల (istock image)
తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల (istock image)

డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులతో పాటు బీఎస్సీ (గణితం) చదివిన వేలాది మంది అభ్యర్థులు ఈ ఏడాది ఈసెట్ పరీక్షకు హాజరయ్యారు. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీ (Preliminary Key) పై అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. అభ్యంతరాలన్నింటినీ నిపుణుల కమిటీ పరిశీలించిన అనంతరం.... అభ్యర్థుల మార్కులు, సాధించిన స్టేట్ వైడ్ ర్యాంకులను ఇవాళ ప్రకటించారు.

టీజీ ఈసెట్ 2026 - ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ ఇలా :

  1. మొదటగా టీజీ ఈసెట్ అధికారిక వెబ్‌సైట్ ecet.tsche.ac.in ను సందర్శించాలి.
  2. హోం పేజీలో కనిపించే 'Download Rank Card'' లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. ఓపెన్ అయిన కొత్త విండోలో అభ్యర్థి తన ఈసెట్ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number), రిజిస్ట్రేషన్ నంబర్ , పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయాలి.
  4. వివరాలన్నీ సరిచూసుకుని 'View Rank Card' పై క్లిక్ చేయగానే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  5. కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కోసం ఈ ర్యాంక్ కార్డును ప్రింట్‌అవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

టీజీ ఈసెట్ - 2026 ఫలితాల విడుదలైన నేపథ్యంలో ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ త్వరలోనే విడుదలవుతుంది.అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో బీఈ/బీటెక్, బీఫార్మసీ కోర్సుల ద్వితీయ సంవత్సరంలో సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ (ధృవపత్రాల పరిశీలన), వెబ్ ఆప్షన్ల నమోదు తేదీల వివరాలను ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More