TG FSL Recruitment : ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు - హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TG FSL Recruitment 2025 : ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) రిక్రూట్‌మెంట్ రాత పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://www.tgprb.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Published on: Feb 26, 2026, 15:17:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీస్‌లో ఖాళీగా ఉన్న 60 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ముందుగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఆ తర్వాత 1:5 నిష్పత్తిలో రాత పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేశారు. అయితే తాజాగా ఈ రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు
ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు

ఇలా డౌన్లోడ్ చేసుకోండి…

  • అభ్యర్థులు ముందుగా https://www.tgprb.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో FSL (Technical Posts) Recruitment 2025 ఆప్షన్ ఉంటుంది. ఇందులో హాల్ టికెట్ లింక్ ఉంటుంది.
  • హాల్ టికెట్ పై క్లిక్ చేసి మొబైల్ నెంబర్, పాస్ వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ కావాలి.
  • ఇక్కడ మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందాలి.

ఇందుకు సంబంధించిన రాత పరీక్షలను మార్చి 5, 6,7 తేదీల్లో నిర్వహిస్తారు. ప్రతిరోజూ మూడు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. మార్చి 4వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక హాల్‌ టికెట్ డౌన్లోడ్ ప్రాసెస్ లో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే support@tslprb.in కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య 9391005006 నంబర్‌ను సంప్రదించి సహాయం పొందవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More