...
...
Next Story

School Summer Holidays : స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు - తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు, ఎప్పటివరకంటే..?

Telangana School Summer Holidays : పాఠశాలల పునఃప్రారంభాన్ని తెలంగాణ సర్కార్ వాయిదా వేసింది. గతంలో ప్రకటించిన జూన్ 12కు బదులుగా…. జూన్ 15 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Published on: Jun 7, 2026, 13:13:37 IST
Advertisement

Telangana School Summer Holidays : తెలంగాణలోని విద్యార్థులకు, తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వేసవి సెలవుల ముగింపు దశకు చేరుకున్న తరుణంలో స్కూళ్ల రీఓపెనింగ్ తేదీని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా…. ఆ తేదీని మార్చుతూ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఉత్తర్వుల ప్రకారం జూన్ 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు

రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గకపోవడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండటంతో విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ రెండో వారంలో కూడా భానుడి భగభగలు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ నివేదికల నేపథ్యంలో…. విద్యాశాఖ ఈ మేరకు వేసవి సెలవులను మరో మూడు రోజుల పాటు పొడిగించింది.

ప్రభుత్వ నిర్ణయంతో అటు విద్యార్థులకు అదనంగా సెలవులు దొరకడమే కాకుండా, ఇటు తల్లిదండ్రులకు కూడా పెద్ద ఊరట లభించింది. జూన్ 15వ తేదీ సోమవారం కావడంతో ఆ రోజు నుంచి విద్యాసంవత్సరం పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది. అన్ని మేనేజ్‌మెంట్ల పరిధిలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని…. జూన్ 15 నుంచే తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. పాఠశాలల పునఃప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లను, ఉపాధ్యాయుల లభ్యతను ముందే సమీక్షించుకోవాలని అంతర్గత ఆదేశాల్లో పేర్కొన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks