వరంగల్‌ విమానాశ్రయంపై మరో ముందడుగు - ఎయిర్ పోర్టు అథారిటీకి 300 ఎకరాలు అప్పగింత

వరంగల్ మామునూరు ఎయిర్​పోర్టులో మరో అడుగు ముందుకు పడింది.  భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయగా…  300 ఎకరాల భూములను ఎయిర్ పోర్టు అథారిటీకి అప్పగించింది. 

Published on: Jan 30, 2026, 11:42:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వరంగల్ ఎయిర్ పోర్టు పనుల ప్రక్రియ త్వరలోనే పట్టాలెక్కేలా కనిపిస్తోంది. కీలకమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే పూర్తి చేసింది. దీంతో ఎయిర్ పోర్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయిపోయింది. అయితే 300 ఎకరాల భూసేకరణకు సంబంధించిన పత్రాలను గురువారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విమానా

ఎయిర్ పోర్టు అథారిటీకి 300 ఎకరాలు అప్పగింత
ఎయిర్ పోర్టు అథారిటీకి 300 ఎకరాలు అప్పగింత

విమానాశ్రయం కోసం సేకరించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)కి అప్పగించింది. గురువారం బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న ‘వింగ్స్‌ ఇండియా’ కార్యక్రమంలో గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడుకు ఈ భూముల పత్రాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు. రూ.850 కోట్లతో మామునూరు విమానాశ్రయం రన్‌వే, ఆధునిక టెర్మినల్‌ భవనాల నిర్మాణం చేపట్టామని.. రెండేళ్లలో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.

సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు - డిప్యూటీ సీఎం

“వరంగల్ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు 300 ఎకరాల భూమిని కేంద్ర విమానయాన శాఖకు అప్పగించిన ఈ క్షణం తెలంగాణ విమానయాన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. 1930లో నిజాం కాలంలోనే నిర్మితమై, ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా వెలుగొందిన మామునూరు వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రూ. 300 కోట్ల నిధులు కేటాయించి, దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశాము” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

వీలైనంత త్వరలో శంకుస్థాపన - మంత్రి పొంగులేటి

భూసేకరణ పత్రాలు అప్పగింత కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూాడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ… రాష్ట్రంలో ఇప్పటివరకు ఒకే ఒక్క ఎయిర్‌పోర్ట్ ఉందన్నారు. అందుకే ఈ ప్రజాప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంకా మూడు ఎయిర్‌పోర్ట్ లను ఏర్పాటు చేయాలని సంకల్పించడం జరిగిందన్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా మన తెలుగు రాష్ట్రానికి చెందిన రామ్మోహన్ నాయుడు కావడం ఎంతో గర్వకారణమని చెప్పుకొచ్చారు.

“ముఖ్యంగా వరంగల్ ప్రజల చిరకాల కోరికైన ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరు శాసనసభ్యులు అక్కడ రైతులందరిని ఒప్పించి పూర్తి సహకారంతో ఎయిర్ పోర్ట్ భూములను ఇప్పించడం జరిగింది. వీలైనంత తొందరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని కోరడం జరిగింది” అని మంత్రి పొంగులేటి తెలిపారు.

“రాష్ట్రంలో ఇంకా కొత్తగూడెం, ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టుల రిక్వైర్మెంట్ అంశం పెండింగ్ లో ఉంది. కేంద్రం నుంచి అనుమతులు త్వరగా వచ్చేలా కేంద్రమంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరడం జరిగింది. అనుమతులు వచ్చిన తర్వాత వాటికి అవసరమైన భూములను అప్పగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలపడం జరిగింది” అని మంత్రి పొంగులేటి తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More