బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ పోటీలు - రూ. 3 లక్షల ప్రథమ బహుమతి
Bathukamma Young Filmmakers Challenge 2026 : యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026 నిర్వహిస్తోంది. ఎంట్రీలను ఈ నెల 15 లోపు పంపాల్సి ఉంటుంది
Bathukamma Young Filmmakers Challenge 2026 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు సజీవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ప్రచారం చేయడంతో పాటు యువతలో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వేదికను సిద్ధం చేసింది. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC) ఆధ్వర్యంలో ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026’ పోటీలను నిర్వహిస్తోంది.

షార్ట్‌ఫిలింలు, పాటలు, క్రియేటివ్ వీడియోల ద్వారా యువత తమ ప్రతిభను చాటుకోవడానికి ఈ పోటీ ఒక అద్భుతమైన అవకాశం. తెలంగాణ రాష్ట్ర విశిష్టత, మన జానపద కళలు, సంప్రదాయాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాదరణ పొందేలా సృజనాత్మకంగా ఆవిష్కరించడానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుంది.
పోటీల థీమ్‌లు….
ఈ పోటీల్లో పాల్గొనే అభ్యర్థులు క్రింది రెండు ప్రధాన థీమ్‌ల ఆధారంగా తమ షార్ట్ ఫిలింలు లేదా పాటలను రూపొందించాల్సి ఉంటుంది.
- తెలంగాణలో ప్రజా పాలన : తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైన నాటి నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలైన ఉచిత బస్సు ప్రయాణం (మహాలక్ష్మి), గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి అభివృద్ధి పథకాలపై కథా చిత్రాలు.
- తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలు : మన సంస్కృతి, బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రతిబింబించే చిత్రాలు.
పోటీ కేటగిరీలు :
- షార్ట్ ఫిలింమ్స్ : నిడివి గరిష్టంగా 3 నిమిషాలకు మించకూడదు.
- పాటలు : నిడివి 5 నిమిషాలకు మించకుండా ఉండాలి.
- ప్రభుత్వ స్కీమ్స్ : ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై మౌఖిక వ్యాసాలకు ఆహ్వానం (రూ. 1 లక్ష బహుమతి).
- ప్రథమ బహుమతి : రూ. 3,00,000
- ద్వితీయ బహుమతి: రూ. 2,00,000
- తృతీయ బహుమతి: రూ. 1,00,000
- కన్సోలేషన్ బహుమతి: ఐదుగురికి ఒక్కొక్కరికి రూ. 20,000 చొప్పున ప్రదానం చేస్తారు.
విజేతలకు అక్టోబర్ 18, 2026న రవీంద్ర భారతిలో జరిగే ప్రధానోత్సవంలో నగదు బహుమతితో పాటు శాలువా, ప్రశంసా పత్రం, మెమెంటో అందజేస్తారు. అంతేకాకుండా, విజేతలకు భవిష్యత్తులో ప్రభుత్వం నిర్మించే చిత్రాల్లో ప్రాధాన్యత లభిస్తుంది.
అర్హతలు….
- అభ్యర్థుల వయస్సు 40 సంవత్సరాల లోపు ఉండాలి.
- వీడియోలు తప్పనిసరిగా 4K రిజల్యూషన్‌లో ఉండాలి.
- షార్ట్ ఫిలిం లేదా వీడియో సూచించిన థీమ్‌పైనే ఆధారపడి ఉండాలి.
- ఈ పోటీలో అర్హత సాధించిన షార్ట్ ఫిలింస్, పాటల సర్వ హక్కులు తెలంగాణ ఫిలిం, టెలివిజన్, థియేటర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ)కే చెందుతాయి.
- ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 15లోపు youngfilmmakerschallenge@gmail.com మెయిల్ కు గానీ, 8125834009 వాట్సాప్ నంబరుకు గానీ పంపాలి. అనంతరం నిపుణులతో కూడిన జ్యూరీ విజేతలను ప్రకటిస్తుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

