Telangana : రాష్ట్రంలో మరో కొత్త స్కీమ్ - ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా! దరఖాస్తులు ఎప్పుడంటే..?
TG Indiramma Family Life Insurance Scheme : ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న తెలంగాణ ప్రభుత్వం 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' ప్రారంభించనుంది. కుటుంబ పెద్ద మరణిస్తే రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. ఈ-శ్రామ్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు.
TG Indiramma Family Life Insurance Scheme : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టనుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న రాష్ట్రవ్యాప్తంగా 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని' అధికారికంగా ప్రారంభించనుంది.

రూ. 5 లక్షల ఆర్థిక భరోసా...
ఈ పథకం కింద ప్రతి కుటుంబంలో ఉపాధి పొందే ఒక ప్రధాన వ్యక్తికి రూ. 5 లక్షల జీవిత బీమా రక్షణ లభిస్తుంది. 18 నుంచి 59 ఏళ్ల వయసు గల కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే, ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. పాలసీదారులు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.
"కుల, మత, ఆదాయ భేదాలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ బీమా సౌకర్యాన్ని అందిస్తున్నాం," అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
దరఖాస్తు ప్రక్రియ... ప్రత్యేక శిబిరాలు
నవంబర్ 19వ తేదీ నుంచే ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ-శ్రామ్ (e-Shram) పోర్టల్ ద్వారా అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో ఏకకాలంలో లబ్ధిదారుల నమోదు చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఇందుకోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక నమోదు శిబిరాలను నిర్వహిస్తారు. పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతల కోసం ప్రజలు తమ సమీపంలోని ఎంపీడీవో (MPDO), గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

