...
...
Next Story

'కుడా' ఛైర్‌పర్సన్‌గా సుధారాణి - పదవి నుంచి చిన్నారెడ్డి ఔట్..! గద్వాల విజయలక్ష్మికి చోటు

తెలంగాణ ప్రభుత్వం పలు కీలక పదవులను భర్తీ చేసింది. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) ఛైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ జి. సుధారాణిని నియమించింది. ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ… డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసింది.

Published on: Sep 3, 2026, 14:44:53 IST
Advertisement

తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై చర్చలు కొనసాగుతుండగా… మరోవైపు కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. చిన్నారెడ్డిపై వేటు వేసిన కాంగ్రెస్ అధినాయకత్వం….తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ ఛైర్మన్ పదవి నుంచి తప్పించింది. కొత్తగా గద్వాల విజయలక్ష్మిని నియమించింది.

తెలంగాణ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు
తెలంగాణ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు

కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) కొత్త ఛైర్‌పర్సన్‌గా రాజ్యసభ మాజీ సభ్యురాలు జి. సుధారాణిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కుడా పరిధిలోని పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన దిశగా ఆమె ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి రెండేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మార్పుల ద్వారా నామినేటెడ్ కార్పొరేషన్లు, కీలక బోర్డుల్లో నూతన సమీకరణాలకు తెరతీసినట్లు అయింది.

మరోవైపు ఈ నియామాకాలతో కొండా సురేఖ విషయంలో కూడా ఇదే మాదిరి నిర్ణయం ఉండొచ్చని సమాచారం. మంత్రివర్గం నుంచి ఆమెను తప్పించటం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు లోక్ భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe