రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మే నెలలో ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. అయితే ఈసారి కాలేజీల ఫీజుల విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ట్యూషన్ ఫీజులను నిర్ధారిస్తూ విద్యాశాఖ గురువారం జీవో(6) జారీ చేసింది.
ట్యూషన్ ఫీజులు ఖరారు…

రాష్ట్రంలో ఉన్న 160 ఇంజినీరింగ్ కాలేజీలకు ప్రభుత్వం ట్యూషన్ ఫీజులను ఖరారు చేసింది. ఈ నిర్ణయించిన ఫీజులు ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడేళ్ల బ్లాక్ పీరియడ్ కు ఈ నిర్ణయం వర్తిస్తుంది. అంటే 2025-26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాల్లో బీటెక్ ఫస్టియర్‌లో చేరినవారికి ఈ ఫీజులనే వర్తిస్తాయి. అత్యధికంగా CBITకి ఫీజు రూ.1.83 లక్షలుగా నిర్ణయించింది.
ఇంజినీరింగ్ కాలేజీల ఫీజల విషయంలో తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. అన్ని అంశాలను క్రోడీకరించి… ప్రభుత్వానికి పలు సిఫార్సులను అందజేసింది. ఈ సిఫార్సులను ఆమోదించిన సర్కార్…. తాజాగా 160 కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ జీవో 6ను జారీ చేసింది.
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 160 ప్రైవేటు కాలేజీల్లో అత్యధికంగా సీబీఐటీలో 1.83 లక్షల ఫీజును నిర్ణయించారు. రూ.1.75 లక్షలతో వాసవి ఇంజినీరింగ్ కళాశాల రెండో స్థానంలో నిలిచింది.
- సుమారు 19 కాలేజీల్లో అత్యల్పంగా రూ.45 వేల ట్యూషన్ ఫీజు ఉంది.
- రాష్ట్రవ్యాప్తంగా 126 ప్రైవేట్ కాలేజీల్లో లక్షలోపే ఫీజును ఫైనల్ చేశారు.
- 33 ఇంజినీరింగ్ కళాశాలల్లో రూ.లక్షకు పైగా ఫీజు ఉంది.
- రూ.లక్ష ఫీజు ఉన్న కళాశాలల సంఖ్య అప్పట్లో ఏడుగా ఉండగా… ప్రస్తుతం 2కి తగ్గింది.
- 19 కాలేజీలకు ఇప్పటివరకు ఉన్న ట్యూషన్ ఫీజులను తగ్గించడంతోపాటు 70 కళాశాలలకు ఒక్క రూపాయి కూడా పెంచకుండా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- కనీస ఫీజు రూ.45 వేలు ఉండగా.. 21 కళాశాలలకు ఆ రుసుమును ఖరారు చేశారు.
- తాజాగా నిర్ణయించిన ఫీజులు ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నుంచే అమల్లోకి వస్తాయి.
- ప్రభుత్వం కొత్త ఫీజులను నిర్ణయించిన తర్వాత ఒకవేళ తగ్గితే ఆ వ్యత్యాసాన్ని వెనక్కి చెల్లించాల్సి ఉంటుంది.
అత్యధిక ఫీజులు - టాప్ కాలేజీలు..
- సీబీఐటీ - రూ. 1,83,000
- వాసవి ఇంజినీరింగ్ కాలేజీ - రూ. 1,75,000
- ఎంజీఐటీ - రూ. 1,67,000
- సీవీఆర్ - రూ.1,63,000
- జి.నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీ - రూ. 1,62,000
- గోకరాజు గంగరాజు - రూ.1,60,500
- VNR విజ్ఞాన జ్యోతి రూ.1,59,600
- కిట్స్ - రూ.1,46,200
- బీవీరాజు ఇనిస్టిట్యూట్ రూ.1,46,600
- MVSR ఇంజినీరింగ్ కాలేజీ - రూ. 1,43,800
- బీవీఆర్‌ఐటీ విమెన్ - రూ 1,43,500
- ఎస్‌ఆర్ - రూ. 1.41 లక్షలు
- వర్ధమాన్ - రూ.1.40 లక్షలు
ట్యూషన్ ఫీజును ఒకేసారి కాకుండా…. వీలును బట్టి వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. సర్కారు నిర్ణయించిన ఫీజు మినహా క్యాపిటేషన్ ఫీజు లేదా ఇతర విరాళాల పేరుతో అదనంగా ఒక్క రూపాయి వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
{{/usCountry}}ట్యూషన్ ఫీజును ఒకేసారి కాకుండా…. వీలును బట్టి వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. సర్కారు నిర్ణయించిన ఫీజు మినహా క్యాపిటేషన్ ఫీజు లేదా ఇతర విరాళాల పేరుతో అదనంగా ఒక్క రూపాయి వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
{{/usCountry}}