Mission K-100 : ధాన్యం కొనుగోళ్ల సమస్యలకు చెక్.. మిషన్ కే-100 యాక్షన్ ప్లాన్

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల కోసం మిషన్ కే-100ను ప్రభుత్వం ప్రారంభించింది. పంట చేతికి వచ్చేలోపు రవాణా, ఆర్థికపరమైన అడ్డంకులు తొలగించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

Published on: Jul 2, 2026, 11:45:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో వానాకాలం (ఖరీఫ్ 2026-27) సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోళ్లలో ఎదురయ్యే రవాణా, నిల్వ, ఆర్థికపరమైన అడ్డంకులను అధిగమించడానికి మిషన్ కే-100 పేరుతో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను అధికారికంగా ప్రారంభించింది.

తెలంగాణలో ధాన్యం సేకరణ
తెలంగాణలో ధాన్యం సేకరణ

పౌరసరఫరాల భవనంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర, భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ జి.ఎన్. రాజుతో కలిసి ఈ సరికొత్త మిషన్‌ను లాంచ్ చేశారు. మిల్లుల్లో పెండింగ్‌లో ఉన్న ధాన్యాన్ని వేగంగా తరలించేందుకు తగిన గోదాములను కేటాయించాలని, అలాగే రాష్ట్రానికి రావలసిన పాత ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎఫ్‌సీఐని కమిషనర్ కోరారు.

మిషన్ కే-100 ప్రకారం.. కొత్త పంట కొనుగోలు కేంద్రాలకు వచ్చేలోపు సరఫరా వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేయడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఇందులో ఐదు ప్రాధాన్యత రంగాలు ఉన్నాయి: కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR)ను ఎఫ్‌సీఐకి వేగంగా అప్పగించడం, నిల్వ ఖర్చులను తగ్గించుకోవడానికి, ఆర్థిక లభ్యతను పెంచుకోవడానికి ధాన్యం నిల్వలను వేలం వేయడం, కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన సబ్సిడీలు, ఇతర బకాయిలను వేగంగా రాబట్టడం, కూలీలపై ఆధారపడటాన్ని తగ్గించి, పని వేగాన్ని పెంచడానికి భారీగా ధాన్యం వచ్చే కొనుగోలు కేంద్రాలలో ఆటోమేటిక్ పరికరాలను అందుబాటులోకి తేవడం, కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల మధ్య రవాణా అడ్డంకులను తొలగించడం, వాహనాల సంఖ్యను పెంచడంతో పాటు అక్రమాలను అరికట్టేందుకు రియల్ టైమ్ వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్(VLTS)ను ప్రవేశపెట్టడం ఇందులో ఉన్నాయి.

ఈ మిషన్ కే-100 ద్వారా రాష్ట్రంలోని ధాన్యం నిల్వ, రవాణా, ఆర్థిక నిర్వహణ వ్యవస్థల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More