తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఓటర్ల జాబితా షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్, అలాగే వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలకు కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియను ప్రారంభించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వెల్లడించారు.

రాష్ట్రంలో డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ గడువులను నిర్ణయించింది. ఈ నెల 20న నోటిఫికేషన్/పబ్లిక్ నోటీసు జారీ కానుంది. ఈ నెల 20 నుంచి ప్రారంభమై నవంబరు 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
నవంబరు 25న డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ప్రకటిస్తారు. నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు అభ్యంతరాలు, సవరణలు స్వీకరిస్తారు. డిసెంబరు 30న పట్టభద్రుల తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు.
గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉన్న అభ్యర్థులు కూడా ఈసారి కచ్చితంగా కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. సాధారణ అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఓటర్ల జాబితాలాగా ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా శాశ్వతంగా ఉండదు. ప్రతీసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి.
ఈ ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు అభ్యర్థులు ఏదేనీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసి ఉండాలి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో CEO Telangana వెబ్‌సైట్ ద్వారా లేదా ఫారమ్-18 నింపి సంబంధిత తహసీల్దార్/ఆర్డీవో కార్యాలయాల్లో డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ జతచేసి సమర్పించవచ్చు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి ప్రతినిధిగా ఉన్న పర్వతనేని వాణిదేవి, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) ల పదవీ కాలం వచ్చే మార్చి నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ కానున్న ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తోంది. తుది జాబితా విడుదలైన అనంతరం వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది.
{{/usCountry}}హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి ప్రతినిధిగా ఉన్న పర్వతనేని వాణిదేవి, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) ల పదవీ కాలం వచ్చే మార్చి నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ కానున్న ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తోంది. తుది జాబితా విడుదలైన అనంతరం వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది.
{{/usCountry}}