తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల శాసనమండలి(Graduate MLC) ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో కీలక మార్పు చోటుచేసుకుంది. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ. సుదర్శన్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. కొత్త నిర్ణయం ప్రకారం అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసే చివరి రోజు వరకు తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

గత కొన్ని రోజులుగా ఓటరు నమోదు కోసం వినియోగిస్తున్న అధికారిక పోర్టల్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోవడంతో వేలాది మంది పట్టభద్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్‌లో సాంకేతిక అడ్డంకులు ఏర్పడి సేవలు నిలిచిపోయాయి. వెబ్సైట్ సర్వర్ లోపాలను త్వరితగతిన సరిదిద్ది, ఆన్లైన్ దరఖాస్తు సేవలను త్వరలోనే పునరుద్ధరిస్తామని సీఈఓ తెలిపారు.
సాంకేతిక కారణాల వల్ల దరఖాస్తు చేయలేకపోయిన గ్రాడ్యుయేట్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నామినేషన్ల గడువు వరకు అవకాశం అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం ప్రక్రియ ముమ్మరం చేసింది. నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారికంగా వెల్లడిస్తారు. ముసాయిదా జాబితా విడుదలైన రోజు (నవంబర్ 25) నుండి డిసెంబర్ 10 వరకు మార్పులు, చేర్పులు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. దాఖలైన దరఖాస్తులు, అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తుది ఓటర్ల జాబితాను రూపొందిస్తారు.
ఆన్లైన్లో ఎలా రిజిస్ట్రర్ చేయాలి?
ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్సైట్ ceotelangana.nic.inను సందర్శించాలి.
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న 'Graduate MLC Voter Registration (Form-18)' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
అడిగిన వ్యక్తిగత, విద్యా వివరాలను సరిగ్గా నమోదు చేయాలి.
{{/usCountry}}అడిగిన వ్యక్తిగత, విద్యా వివరాలను సరిగ్గా నమోదు చేయాలి.
{{/usCountry}}డిగ్రీ సర్టిఫికెట్ లేదా ప్రొవిజనల్ కాపీ, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ స్కాన్ చేసిన ప్రతులను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆన్లైన్ సబ్మిషన్ పూర్తయిన తర్వాత వచ్చిన అప్లికేషన్ ప్రింట్ అవుట్‌ను డౌన్లోడ్ చేసుకుని, దానికి అవసరమైన సర్టిఫికేట్ల నకళ్లను జతచేసి స్థానిక ఎన్నికల అధికారులకు సమర్పించాలి.
ఆఫ్‌లైన్ నమోదు
ఆఫ్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు. జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఉచితంగా లభించే ఫారం-18 పత్రాలను తీసుకోవాలి. ఫారాన్ని పూర్తిగా నింపి దానితో పాటు గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన డిగ్రీ, ఆధార్, రెసిడెన్స్ సర్టిఫికేట్ల జిరాక్స్‌లను జతచేయాలి. ఈ పత్రాలను నేరుగా సంబంధిత కార్యాలయాల్లో అందజేయవచ్చు లేదా పోస్టు ద్వారా అధికారులకు పంపవచ్చు.
స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా..
అధికారిక పోర్టల్ https://ceotserms2.telangana.gov.in/ లింక్‌పై క్లిక్ చేయాలి. వెబ్సైట్ హోమ్ పేజీ ఓపెన్ అయిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే Form-18 (Graduate's) విభాగం వద్దకు వెళ్లాలి. దరఖాస్తు చేసుకున్న సమయంలో వచ్చిన అప్లికేషన్ ఐడీని బాక్స్‌లో నమోదు చేయాలి. ఆ తర్వాత కింద ఉండే Get Application Status అనే బటన్ మీద క్లిక్ చేయాలి. వెంటనే మీ దరఖాస్తుకు సంబంధించిన వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. స్క్రీన్‌పై కరెంట్ స్టేటస్ అనే విభాగాన్ని పరిశీలిస్తే.. మీ అప్లికేషన్ ఏ దశలో ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకు BLO Verification లేదా Approved అని ఉంటే మీ దరఖాస్తు పరిశీలనలో ఉందని లేదా ఆమోదం పొందిందని గుర్తించవచ్చు.