MLC Vote Registration Status : ఎమ్మెల్సీ ఓటుకు అప్లయ్ చేసుకున్నారా..? దరఖాస్తు విధానం, స్టేటస్ చెక్ ఇలా...

Telangana Graduate MLC Voter Registration : వరంగల్‌-ఖమ్మం-నల్గొండ, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పట్టభద్రుల ఓటరు నమోదు కొనసాగుతోంది. నవంబరు 6వ తేదీతో గడువు ముగియనుంది. అర్హతలు, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 1, 2026, 13:21:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Telangana Graduate MLC Voter Registration : తెలంగాణలోని పట్టభద్రుల శాసనమండలి (ఎమ్మెల్సీ) నియోజకవర్గాల ఓటరు జాబితా తయారీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా వరంగల్‌-ఖమ్మం-నల్గొండ మరియు మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకుంటున్నారు. ఈ ఓటరు నమోదు ప్రక్రియకు నవంబరు 6వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. గడువు ముగిసేలోగా పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు-ఓటర్ నమోదు
ఎమ్మెల్సీ ఎన్నికలు-ఓటర్ నమోదు

ఎవరు అర్హులు….?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవడానికి 2023 అక్టోబరు 31 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా దానికి సమానమైన తత్సమాన డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు. 2023 అక్టోబరు 31 నాటికే సంబంధిత విద్యా సంస్థ లేదా యూనివర్సిటీ జారీ చేసిన డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్, మార్కుల మెమో లేదా ప్రొవిజినల్‌ ధృవపత్రాన్ని పొంది ఉండాలి. అంతేకాకుండా, దరఖాస్తు చేసుకునే పట్టభద్రుడు ప్రస్తుతం ఆయా ఎమ్మెల్సీ నియోజకవర్గాల సరిహద్దు పరిధిలోనే నివాసముంటుండాలి.

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ప్రత్యేకంగా 'ఫారం-18' నింపాల్సి ఉంటుంది. ఓటర్లు సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల యంత్రాంగం ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానాలలో అవకాశం కల్పించింది.

ఆన్‌లైన్ నమోదు విధానం:

  1. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్‌సైట్ ceotelangana.nic.in ను సందర్శించాలి.
  2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న 'Graduate MLC Voter Registration (Form-18)' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  3. అక్కడ అడిగిన వ్యక్తిగత, విద్యా వివరాలను సరిగ్గా నమోదు చేయాలి.
  4. డిగ్రీ సర్టిఫికెట్ లేదా ప్రొవిజనల్ కాపీ, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ స్కాన్ చేసిన ప్రతులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  5. ఆన్‌లైన్ సబ్‌మిషన్ పూర్తయిన తర్వాత వచ్చిన అప్లికేషన్ ప్రింట్ అవుట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, దానికి అవసరమైన సర్టిఫికేట్ల నకళ్లను జతచేసి స్థానిక ఎన్నికల అధికారులకు సమర్పించాలి.

ఆఫ్‌లైన్ నమోదు విధానం:

ఆన్‌లైన్ వెసులుబాటు లేని వారు ఆఫ్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు. జిల్లా కలెక్టరేట్లు, ఆర్‌డీఓ (RDO), తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఉచితంగా లభించే ఫారం-18 పత్రాలను తీసుకోవాలి. ఫారాన్ని పూర్తిగా నింపి, దానితో పాటు గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన డిగ్రీ, ఆధార్, రెసిడెన్స్ సర్టిఫికేట్ల నకళ్లను జతచేయాలి. ఈ పత్రాలను నేరుగా సంబంధిత కార్యాలయాల్లో అందజేయవచ్చు లేదా పోస్టు ద్వారా అధికారులకు పంపవచ్చు.

ఎమ్మెల్సీ ఓటు దరఖాస్తు స్టేటస్ చెక్ చేసుకునే ప్రాసెస్…

దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ అప్లికేషన్ ఏ స్థితిలో ఉందో తెలుసుకోవచ్చు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

  • ముందుగా అధికారిక పోర్టల్ https://ceotserms2.telangana.gov.in/ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • వెబ్‌సైట్ హోమ్ పేజీ ఓపెన్ అయిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే "Form-18 (Graduate's)" విభాగం వద్దకు వెళ్లాలి.
  • మీరు దరఖాస్తు చేసుకున్న సమయంలో వచ్చిన అప్లికేషన్ ఐడీ (Application ID)ని అక్కడ ఉన్న బాక్స్‌లో నమోదు చేయాలి.
  • ఆ తర్వాత కింద ఉండే "Get Application Status" అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
  • వెంటనే మీ దరఖాస్తుకు సంబంధించిన వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
  • స్క్రీన్‌పై "Current Status" అనే విభాగాన్ని పరిశీలిస్తే.. మీ అప్లికేషన్ ఏ దశలో ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు 'BLO Verification' లేదా 'Approved' అని ఉంటే మీ దరఖాస్తు పరిశీలనలో ఉందని లేదా ఆమోదం పొందిందని గుర్తించవచ్చు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More